అంద వికారానికి అవార్డు వచ్చిన మిస్టర్​ హ్యాపీ ఫేస్​..

28-06-2022 Tue 13:12
Mr Happy Face who received the Worlds Ugliest Dog award

వంకర ముఖం.. నోట్లో పళ్లు కూడా సరిగా లేవు. ఒక్కసారిగా చూస్తే హైనానో, మరో జంతువో అన్నట్టు కనిపిస్తుంది.. నాలుక బయటపెట్టి నవ్వుతున్నట్టుగా ఉంటుంది. దానిపేరు మిస్టర్ హ్యాపీ ఫేస్. ఇటీవలే అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన వరల్డ్ అగ్లీయెస్ట్ డాగ్ పోటీల్లో టాప్ లో నిలిచి అవార్డు అందుకుంది. దీని వయసు 17 ఏళ్లు. దాని అనారోగ్యం కారణంగా వింతగా అదోరకంగా గురకపెడుతుంది. అమెరికాలోని అరిజోనాకు చెందిన 48 ఏళ్ల జెనెడా బెనెల్లీ గత ఏడాది దానిని దత్తత తీసుకున్నారు.

ఎక్కువ రోజులు బతకదని తెలిసినా..

అరిజోనాలో అనాథగా ఉన్న ఈ కుక్క ఎక్కువ కాలం బతకదని వెటర్నరీ డాక్టర్లు గుర్తించారు. బతికినన్ని రోజులు మందులు వాడుతూ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఇవన్నీ తెలిసిన బెనెల్లీ దయార్ధ్ర హృదయంతో తెచ్చుకున్నారు. మిస్టర్ హ్యాపీ ఫేస్ అని పేరు పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇటీవలే పోటీలకు తీసుకెళ్తే.. ‘వరల్డ్ అగ్లీయెస్ట్ డాగ్’ అవార్డు వచ్చింది. దీనిపై బెనెల్లీ పాజిటివ్ గా స్పందించారు. ‘‘మిస్టర్‌ హ్యాపీ ఫేస్‌ అందవికారానికి కాదు.. అంతః సౌందర్యానికి వచ్చిన గుర్తింపుగా ఈ అవార్డును భావిస్తాను’’ అని బెనెల్లీ చెబుతున్నారు. ఈ బహుమతి కింద రూ.లక్షా 20వేల నగదు కూడా అందనుండటం గమనార్హం.

..Read this also
రెండు చేతుల‌తో 11 రీతుల్లో చ‌క‌చ‌కా రాస్తున్న చిన్నారి... వీడియో ఇదిగో
 • ఒకేసారి రెండు చేతులతో రాస్తున్న మంగ‌ళూరు బాలిక‌
 • బాలిక వీడియోను పంచుకున్న రిటైర్డ్ ఎయిర్ మార్ష‌ల్‌
 • 10 ల‌క్ష‌ల మందిలో ఒక‌రికి ఇలాంటి శ‌క్తి ఉంటుంద‌ని వెల్ల‌డి
 • ఈ ప‌వ‌ర్‌ను ఆంబిడెక్సెరిటీగా పిలుస్తార‌న్న అనిల్ చోప్రా


..Read this also
సొంతంగా ఓ దీవి కొనుక్కుంటారా.. రూ.3.5 కోట్లకే అమ్మకం!
 • 28 ఎకరాల విస్తీర్ణం.. ఓ పెద్ద ఇల్లు, హెలిప్యాడ్, మరో రెండు చిన్న నివాసాలు కూడా..
 • రకరకాల సముద్ర జీవులు, పక్షులకు నిలయమైన ప్లాడ్డా దీవి
 • నౌకలకు దారి చూపే లైట్ హౌజ్.. చుట్టూ మరికొన్ని దీవులు

..Read this also
14 క్యారెట్ల బంగారం ఆభరణాలు మంచివేనా..?
 • 18, 14 క్యారెట్ల ఆభరణాలకు పెరుగుతున్న డిమాండ్
 • 22 క్యారెట్ల ఆభరణాలతో పోలిస్తే మన్నిక ఎక్కువ
 • ధరలు 22-36 శాతం తక్కువ
 • ఆన్ లైన్ లో ఎన్నో ప్రముఖ సంస్థల విక్రయాలు


More Latest News
ex vice president venkaiah naidu releases Khudiram Bose title first look
kodali nani hits back tdp over ysrcp mp gorantla madhav issue
KL Rahul cleared to play and lead Team India in Zimbabwe tour
ts cabinet approvers 10 lack new pensions
ap high court rules out ysrcp counter petition on kesineni nai pil over kondapally local body elections
Maharla Niyojakavargam Team Interview
Prudhvi Raj responds on ysrcp mp gorantla madhav video
ts high orders hyderabad police to give security to cheeoti praveen
Liger movie updare
avanthi srinivas met cm ys jagan with his son nandesh
Balakrishna in Anil Ravipudi movie
ktr son himanshu responds on anand mahindra tweet
nara lokesh tweer on ysrcp leader misbehaviour over women employees
Krishna Vrinda Vihari Movie Update
pmmodi praises venkaiah naidu in his 3 page letter
..more