సుజనా చౌదరికి హైకోర్టులో ఊరట.. అమెరికా, యూరప్ పర్యటనకు హైకోర్టు అనుమతి
28-06-2022 Tue 08:43
- బెస్ట్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మోసం కేసులో సుజనా చౌదరి పాత్ర ఉందన్న సీబీఐ
- లుక్ అవుట్ నోటీసు జారీ
- హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎంపీ
- మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

ఈ నెల 30 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు అమెరికా, యూరప్ దేశాల్లో పర్యటనకు మాజీ ఎంపీ సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బెస్ట్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ. 6 వేల కోట్ల వరకు మోసం చేసిన కేసులో సుజనా చౌదరి పాత్ర ఉందంటూ సీబీఐ లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సుజానా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్ జి.రాధారాణి విచారణ చేపట్టగా, పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కె.వివేక్ రెడ్డి, న్యాయవాది విమల్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం సుజనా చౌదరి విదేశీ పర్యటనకు అనుమతినిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
More Latest News
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
6 hours ago

వీల్ చెయిర్ లో ఉండి కూడా ఆనంద పారవశ్యంతో డ్యాన్స్ చేసిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా... వీడియో ఇదిగో!
6 hours ago

మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుంది... అదే మనందరినీ ఒకటిగా కలుపుతుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
8 hours ago

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే... ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు
8 hours ago
