ఏపీలో పవన్ కల్యాణ్ సీఎం అయ్యే అవకాశమే లేదు: అంబటి రాంబాబు
27-06-2022 Mon 22:06
- వైసీపీ ప్లీనరీ సమావేశాలు
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అంబటి
- చంద్రబాబుకు జై కొట్టేది లోకేశ్, పవనేనని వెల్లడి

వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదని అన్నారు. ఎవరు ఎవరితో కలిసి వచ్చినా వైసీపీని ఓడించలేరని, తాము అధికారం నిలబెట్టుకోవడం తథ్యమని వ్యాఖ్యానించారు. జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే శక్తి చంద్రబాబుకు లేదని, ఇక ఎప్పటికీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేరని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు జై కొట్టేది ఎవరంటే... లోకేశ్, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ మాత్రమేనని వ్యంగ్యంగా అన్నారు. "వచ్చే ఎన్నికల్లో పవన్ తో కలిసి వస్తావో, ఇంకెవరితో కలిసి వస్తావో రా... కట్టకట్టి కృష్ణానదిలో కలిపేస్తాం" అని మంత్రి వ్యాఖ్యానించారు.
More Latest News
జీ20 సమావేశాల నుంచి పుతిన్ ను నిషేధించండి: రిషి సునాక్
58 minutes ago
