మజ్లిస్ మద్దతు యశ్వంత్ సిన్హాకే: అసదుద్దీన్ ఓవైసీ
27-06-2022 Mon 18:37
- విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
- సోమవారం నామినేషన్ వేసిన కేంద్ర మాజీ మంత్రి
- సిన్హాకే మజ్లిస్ ప్రజా ప్రతినిధులు ఓట్లేస్తారన్న అసదుద్దీన్

భారత రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు మరో పార్టీ మద్దతు పలికింది. రాష్ట్రపతి అభ్యర్థిగా సోమవారం యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. సిన్హా నామినేషన్ వేసిన రోజుననే ఆయనకు మద్దతు ప్రకటిస్తూ మజ్లిస్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ కీలక ప్రకటన చేశారు.
మజ్లిస్ పార్టీ ప్రజా ప్రతినిధులు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాకే ఓటు వేస్తారని సదరు ప్రకటనలో అసదుద్దీన్ ప్రకటించారు. ఈ విషయంపై ఇప్పటికే యశ్వంత్ సిన్హా తనకు ఫోన్ చేశారని, ఆ సందర్భంగానే ఆయనకు మద్దతు ప్రకటించానని ఆయన పేర్కొన్నారు.
More Latest News
వీధిలో ఆడుకోవద్దంటూ పిల్లలపై కాల్పులు.. ముగ్గురు పిల్లలకు గాయాలు.. ఢిల్లీలో ఘటనఈశాన్య ఢిల్లీలో ఘటన..
7 hours ago

ధనుశ్ కోసం కొనసాగుతున్న కథల వేట!
11 hours ago

కామన్వెల్త్ క్రీడల్లో రజతంతో సరిపెట్టుకున్న భారత హాకీ జట్టు... ఆసీస్ తో ఫైనల్లో ఘోర పరాజయం
11 hours ago
