నా తల తీసేసినా సరే.. నేను గువాహటి మార్గంలోకి వెళ్లను: ఈడీ సమన్లపై సంజయ్ రౌత్ స్పందన
27-06-2022 Mon 14:41
- ఈడీ సమన్లు ఇవ్వడం మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మలుపు అన్న సంజయ్ రౌత్
- తనను నిలువరించేందుకు చేసిన కుట్ర అని మండిపాటు
- కావాలంటే తనను అరెస్ట్ చేయాలంటూ వ్యాఖ్య

శివసేన కీలక నేత సంజయ్ రౌత్ కు మనీ లాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణ కోసం రేపు తమ కార్యాలయానికి రావాలని సమన్లలో ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ స్పందిస్తూ... తనకు ఈడీ సమన్లు జారీ చేసిందని ఇప్పుడే తెలిసిందని చెప్పారు.
'చాలా మంచిది. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద మలుపు. బాలాసాహెబ్ శివసైనికులైన మేము ఒక పెద్ద యుద్ధం చేస్తున్నాం. ఈడీ సమన్లు ఇవ్వడం నన్ను నిలువరించేందుకు చేసిన ఒక కుట్ర. మీరు నా తల తీసేసినా సరే.. నేను గువాహటి మార్గంలోకి వెళ్లను. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. జైహింద్' అని ట్వీట్ చేశారు.
More Latest News
రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు... వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు
4 minutes ago

తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్
31 minutes ago

తెలంగాణలో ఒక పార్లమెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామకం... జాబితా ఇదిగో
40 minutes ago

40 కోట్లను కొల్లగొట్టిన 'సీతా రామం'
2 hours ago
