/

ఐర్లాండ్‌తో తొలి టీ20: భారత్ అలవోక విజయం

27-06-2022 Mon 06:30
Hooda and Pandya power Indias winning start

రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు అలవోకగా విజయాన్ని అందుకుంది. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు వరుణుడు తొలుత ఆటంకం కలిగించాడు. భారత కాలమానం ప్రకారం గత రాత్రి 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా 2.20 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. 

ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. హెర్రీ టెక్టార్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేయగా, వికెట్ కీపర్ టకర్ 16 బంతుల్లో 2 సిక్సర్లతో 18 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా, అవేష్ ఖాన్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 109 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 9.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ దీపక్ హుడా 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు (నాటౌట్) చేయగా, ఇషాన్ కిషన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. 

ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ 2, జోషువా లిటిల్ ఒక వికెట్ తీసుకున్నారు. యుజ్వేంద్ర చాహల్‌కు ‘ప్లేయర్ ఆప్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్‌లో చివరిదైన రెండో టీ20 రేపు ఇదే మైదానంలో జరుగుతుంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
మహిళా అంపైర్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం
  • పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు
  • మహిళలకు అంపైర్లుగా అవకాశం కల్పించిన బీసీసీఐ
  • త్వరలో జరగనున్న రంజీ ట్రోఫీలో కనిపించనున్న విమెన్ అంపైర్స్

ap7am

..ఇది కూడా చదవండి
దోహాలోని ఈ స్టేడియాన్ని కూల్చేస్తారట.. వీడియో ఇదిగో!
  • ఫిఫా వరల్డ్ కప్ కోసమే స్టేడియం నిర్మాణం
  • పోటీలు పూర్తవడంతో కూల్చేస్తామంటున్న ఖతార్
  • 974 షిప్పింగ్ కంటెయినర్లతో ప్రత్యేకంగా డిజైన్

..ఇది కూడా చదవండి
ఇలాంటి ఫీల్డింగ్ ఎప్పుడైనా చూశారా?.. పాక్‌ను ఇంగ్లండ్‌ ఎలా చుట్టుముట్టిందో చూడండి!
  • ఇంగ్లండ్-పాక్ మ్యాచ్‌లో కనుల విందైన దృశ్యం
  • మొత్తం 11 మందినీ ఒకే చోట మోహరించిన ఇంగ్లండ్ కెప్టెన్
  • పాక్ బ్యాటర్లను ఉక్కిరి బిక్కిరి చేసిన ఫొటో వైరల్


More Latest News
BCCI decides to give women as umpires
Two teenagers executed in North Korea for watching K Dramas and movies
Ukraine minister comments on India
Applications invited for Miss India 2023
Markets ends in losses
Krithi Shetty Special
Organising G20 summit is not great says K Keshav Rao
Employees unions did not attend CPS meeting
MP Gorantla Madhav had bitter experience
Masooda Movie update
CM Jagan cancels Kadapa district visit
Ayyanna Patrudu comments on Jagan
Chandrababu met NITI AAYOG CEO
Unstoppable 2 Update
World top 10 fastest bikes
..more