ఈ విజయం గౌతమ్ కు నివాళి... మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపుపై సీఎం జగన్ స్పందన
26-06-2022 Sun 15:19
- ఆత్మకూరు ఉప ఎన్నికలో విక్రమ్ రెడ్డి విజయం
- గౌతమ్ రెడ్డి మరణంతో ఉప ఎన్నికలు
- గౌతమ్ సోదరుడికి పట్టం కట్టిన నియోజకవర్గ ప్రజలు

మేకపాటి గౌతమ్ రెడ్డి మరణానంతరం ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు. దీనిపై సీఎం జగన్ స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా ఆత్మకూరులో 83 వేల మెజారిటీతో విక్రమ్ ను గెలిపించారని వివరించారు.
విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
More Latest News
తెలంగాణలో కొత్తగా 605 కరోనా పాజిటివ్ కేసులు
5 hours ago

బౌల్ట్, డికాక్ వంటి ఆటగాళ్లు టెస్టులకు దూరం కావడంపై ఐసీసీ దృష్టి సారించాలి: విజయసాయిరెడ్డి
6 hours ago
