సమంత హవా దేశమంతటా!

26-06-2022 Sun 12:58
Samantha Ruth Prabhu tops the list of Indias most popular female stars

మన దేశంలో ఎక్కువ ప్రజాదరణ ఉన్న హీరోయిన్ ఎవరు? అంటే దీపిక పదుకొనె, ఆలియా భట్లో  ఒకరు అనుకుంటాం. ఈ మధ్య దూసుకెళ్తున్న కియారా ఆద్వాణీ అని కూడా కొందరు చెబుతారు. కానీ, వీళ్లెవరూ కాదట. దక్షిణాదిలో అగ్ర నటిగా వెలుగొందుతున్న సమంత.. భారత్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్. ఈ మేరకు ఇటీవల ‘ఓర్మాక్స్ సంస్థ’...  ‘ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్’ పేరిట మన దేశంలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఎవరు అంటూ ఓ సర్వే నిర్వహించింది. అందులో అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్య పరిచింది సమంత. ఆలియా భట్ రెండో స్థానంలో ఉండగా.. నయనతారది మూడో ప్లేస్. దీపికా పదుకొనె ఐదో స్థానంలో నిలవడం గమనార్హం. తర్వాత  కాజల్ అగర్వాల్‌,  కీర్తి సురేష్, కత్రినా కైఫ్, రష్మిక, పూజ హెగ్డే, అనుష్కా శెట్టిలకు చోటు దక్కింది.

 సమంత ఇప్పటిదాకా ఒక్క హిందీ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించలేదు. అయినా బాలీవుడ్ లోనూ ఆమెకు ఇంత క్రేజ్ రావడం విశేషం. దక్షిణాది అన్ని భాషల్లో సత్తా చాటుకున్న సమంత.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ రెండో భాగంలో కీలక పాత్రతో హిందీ జనాలకు చేరువైంది. ఆమె నటనకు అంతా ఫిదా అయ్యారు. ‘పుష్ప’సినిమాలో ఊ అంటావా స్పెషల్ సాంగ్ తర్వాత 
 బాలీవుడ్‌లోనూ సమంత పేరు మార్మోగుతోంది. 

 ప్రస్తుతం సమంత హిందీలో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అలాగే, మరో హీరోయిన్ తాప్సీ నిర్మించే నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రానికి కూడా ఒకే చెప్పింది. ఈ మధ్య సల్మాన్‌ ఖాన్ సినిమా కోసం కూడా సమంతను అడిగినట్లు తెలుస్తోంది. సల్మాన్ హీరోగా అనీజ్ బజ్మీ దర్శకత్వంలో ‘నో ఎంట్రీ’ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు. ఇందులో హీరోయిన్‌గా సమంత కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. సమంత ఒప్పుకుంటే మాత్రం బాలీవుడ్లో ఆమె హవా మరింత పెరగడం ఖాయం.

..Read this also
జబర్ధస్త్ నుంచి బయటకు రావటానికి గల కారణం చెప్పిన అనసూయ
  • సినిమాల్లో నటనపై దృష్టి సారించాలని అనుకుంటున్నట్టు ప్రకటన
  • జబర్దస్త్ తనకు ఇష్టమైన షో అని చెప్పిన అనసూయ
  • సినిమాల కారణంగా సమయం కేటాయించలేక పోతున్నానని వెల్లడి


..Read this also
ఆస్కార్ అవార్డు నామినేషన్లలో జూనియర్ ఎన్టీఆర్?
  • వెరైటీ మ్యాగజైన్ అంచనా
  • ఉత్తమ నటుడి కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు
  • ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రకు మరోసారి గుర్తింపు

..Read this also
లైగర్ చిత్రంలో నా పాత్రకు నత్తి: విజయ్ దేవరకొండ
  • నటించేందుకు ఎంతో కష్టపడ్డానన్న స్టార్ నటుడు
  • ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని ప్రకటన
  • మైక్ టైసన్ కొట్టిన దెబ్బకు రోజంతా నొప్పి వచ్చినట్టు వెల్లడి


More Latest News
Photo of delhi beggar looking like a model
anasuya bharadwaj revealed reasons behind Jabardasth exit
VLC Media Player banned and blocked in India
Man slits wifes throat at family court in karnataka
minister Mallareddy key aide join in to BJP
tirumala piligrims crowd
PM Modi pays homage to those who lost their lives during partition
Rakesh Jhunjhunwala successfull stocks journey Investor
14092 new covid cases 41 deaths in india
 RRR actor Jr NTR in Oscar nominations
trs mlas ready resign and face by elections bandi sanjay bjp state chief
Woman In Karnataka Saving Son From Snake Internet Praises Her Video Shows Woman In Karnataka Saving Son From Snake
Intermediate must for anganwadi teachers qualifications increased
UP CM Yogi PIL activist receive death threat police files case
vijay devarakonda shares about liger role
..more