బెజవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ
25-06-2022 Sat 21:40
- ప్రకటన విడుదల చేసిన నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా
- బెవర శ్రీను, బాలస్వామి, శ్రీను నాయక్, విజయ్ కుమార్, కట్ల కాళీల నగర బహిష్కరణ
- శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్న కమిషనర్

ఏపీలోని విజయవాడ నగరం నుంచి ఐదుగురు రౌడీ షీటర్లను బహిష్కరిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. బెజవాడలో రౌడీ షీట్లు నమోదైన బెవర శ్రీను, బాలస్వామి, శ్రీను నాయక్, విజయ్ కుమార్, కట్ల కాళీలను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
More Latest News