పాకిస్థాన్ కోర్టు సంచలన తీర్పు.. ముంబై దాడుల ప్రధాన హ్యాండ్లర్‌కు 15 ఏళ్ల జైలు

25-06-2022 Sat 09:03
 Mumbai terror attack handler jailed for 15 years in Pakistan

పాకిస్థాన్‌లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో 2008 ముంబై ఉగ్రదాడుల ప్రధాన హ్యాండ్లర్‌ (నిర్వాహకుడు)కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా నేతల టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులతో సంబంధం ఉన్న సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ.. నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన సాజిద్ మజీద్ మిర్‌ (40)కు ఈ నెల మొదట్లో లాహోర్‌లోని యాంటీ టెర్రరిస్ట్ కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్టు తెలిపారు. 

ఇలాంటి కేసుల్లో నిందితుల నేరాన్ని మీడియాకు వెల్లడించే పంజాబ్ పోలీస్‌కి చెందిన కౌంటర్ టెర్రరిజం విభాగం (CTD) ఈ విషయంలో పెదవి విప్పలేదు. మీర్‌కు కోర్టు శిక్ష విధించిన విషయాన్ని వెల్లడించకపోవడం గమనార్హం. కాగా, జైలులో జరుగుతున్న ఇన్-కెమెరా ప్రొసీడింగ్ నేపథ్యంలో మీడియాను కూడా అనుమతించలేదు. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్ట్ అయిన మిర్ ప్రస్తుతం కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్నాడు. మిర్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు రూ. 4 లక్షల జరిమానా కూడా విధించింది. కాగా, తొలుత మిర్ చనిపోయాడని భావించారు.  26/11 ముంబై దాడుల్లో మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. మిర్ తలపై 5 మిలియన్ డాలర్ల నజరానా కూడా ఉంది. భారత మోస్ట్ వాంటెడ్ జాబితాలో మిర్ కూడా ఉన్నాడు.

మిర్ 2005లో నకిలీ పాస్‌పోర్టు ఉపయోగించి భారత్‌కు వచ్చాడు. ముంబై దాడుల నేపథ్యంలో ఆయనను ‘ప్రాజెక్టు మేనేజర్’ అని పిలిచేవారు. మరోపక్క, ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు లాహోర్ యాంటీ టెర్రర్ కోర్టు ఇప్పటికే ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో 68 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

..Read this also
కొవిడ్ పై మహోజ్వల విజయం సాధించాం: కిమ్ జాంగ్ ఉన్ ప్రకటన
 • ఉత్తరకొరియాపైనా ప్రభావం చూపిన కరోనా
 • గత ఏప్రిల్ వరకు 48 లక్షల కేసులు
 • రెండు వారాలుగా జీరో పాజిటివ్
 • విజయోత్సవ సమావేశం నిర్వహించిన కిమ్


..Read this also
సింగపూర్ నుంచి థాయ్ లాండ్ కు వెళ్లనున్న గొటబాయ రాజపక్స
 • ముగుస్తున్న గొటబాయ సింగపూర్ వీసా గడువు
 • ఆశ్రయం ఇవ్వాలని థాయ్ లాండ్ ను కోరిన గొటబాయ
 • మానవతా దృక్పథంతో ఓకే చెప్పిన థాయ్ లాండ్

..Read this also
ఐరాసలో భారత్, అమెరికా ఉగ్రవాద వ్యతిరేక ప్రతిపాదనకు చైనా మోకాలడ్డు
 • పాక్ కేంద్రంగా జైషే మహ్మద్ కార్యకలాపాలు
 • అబ్దుల్ రవూఫ్ అజహర్ పై ఆంక్షలకు భారత్, అమెరికా ప్రయత్నం
 • భద్రతా మండలి ఆంక్షల కమిటీ ముందుకు ప్రతిపాదన
 • ప్రక్రియను నిలుపుదల చేసిన చైనా


More Latest News
ex vice president venkaiah naidu releases Khudiram Bose title first look
kodali nani hits back tdp over ysrcp mp gorantla madhav issue
KL Rahul cleared to play and lead Team India in Zimbabwe tour
ts cabinet approvers 10 lack new pensions
ap high court rules out ysrcp counter petition on kesineni nai pil over kondapally local body elections
Maharla Niyojakavargam Team Interview
Prudhvi Raj responds on ysrcp mp gorantla madhav video
ts high orders hyderabad police to give security to cheeoti praveen
Liger movie updare
avanthi srinivas met cm ys jagan with his son nandesh
Balakrishna in Anil Ravipudi movie
ktr son himanshu responds on anand mahindra tweet
nara lokesh tweer on ysrcp leader misbehaviour over women employees
Krishna Vrinda Vihari Movie Update
pmmodi praises venkaiah naidu in his 3 page letter
..more