టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీకాంత్.. ప్రకటించిన చంద్రబాబు
24-06-2022 Fri 08:23
- రాష్ట్ర ఐటీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్రీకాంత్
- ఆయన గెలుపునకు కృషి చేయాలని కోరుతూ నేతలకు చంద్రబాబు ఫోన్లు
- పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఎంపిక చేయడంపై శ్రీకాంత్ హర్షం

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్‌ను ఎంపిక చేసినట్టు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెలిపారు. కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ కోశాధికారి, రాష్ట్ర ఐటీడీపీ అధికార ప్రతినిధి అయిన శ్రీకాంత్ గెలుపునకు సహకరించాలని కోరుతూ మూడు జిల్లాల పరిధిలోని పార్టీ అధ్యక్షులు, ముఖ్యనాయకులకు చంద్రబాబు నిన్న ఫోన్లు చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేసిన శ్రీకాంత్.. పార్టీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ లను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు.
More Latest News
దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో చెల్లాచెదురుగా మృతదేహాలు... ఎలా చనిపోయారన్నది మిస్టరీ!
15 minutes ago

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ’వై ప్లస్’ సెక్యూరిటీ
17 minutes ago

బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది... ఆత్మకూరులో ఓటింగ్ శాతమే అందుకు నిదర్శనం: విష్ణువర్ధన్ రెడ్డి
35 minutes ago

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు
1 hour ago

తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులు రద్దు.. దర్యాప్తు చేయాలంటూ మానవ హక్కుల సంఘానికి బండి సంజయ్ లేఖ
1 hour ago
