తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు అస్వస్థత
20-06-2022 Mon 12:36 | National
- శనివారం రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతున్న స్టాలిన్
- రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
- రద్దయిన సీఎం మూడు జిల్లాల పర్యటనలు

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్ తెలిపారు. శనివారం రాత్రి ఆయనకు జ్వరం వచ్చిందని చెప్పారు. ఆయనను పరీక్షించిన వైద్యులు రెండు రోజుల విశ్రాంతి అవసరమని చెప్పారని తెలిపారు. అనారోగ్యం నేపథ్యంలో ఈరోజు మూడు జిల్లాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దయిందని చెప్పారు. వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో ఈరోజు స్టాలిన్ పర్యటించాల్సి ఉంది. ఆయన పర్యటనకు డీఎంకే శ్రేణులు భారీ ఏర్పాట్లు కూడా చేశాయి. ఇంతలోనే ముఖ్యమంత్రి పర్యటన రద్దయిందనే ప్రకటన వెలువడింది.
More Latest News
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు జాక్‌పాట్!
3 minutes ago

ఫ్లోరిడాలో దుండగుల కాల్పులు.. పదిమందికి గాయాలు!
34 minutes ago

తీవ్ర ఉత్కంఠ.. మూడు రాజధానులపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ
39 minutes ago

బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
11 hours ago

వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
12 hours ago
