-->

భారత బల్లెం వీరుడు నీరజ్​ బంగారు పతకం గెలిచాడు.. అది కూడా తొలి ప్రయత్నంలోనే​

19-06-2022 Sun 10:09 | Sports
India star Javelin thrower neeraj chopra wins gold at kuortane games

టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ ఏడాది మొదటి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫిన్లాండ్‌‌‌‌లో జరుగుతున్న కౌర్టెన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో అతను స్వర్ణం సాధించాడు. శనివారం జరిగిన పోటీల్లో నీరజ్‌‌‌ తన బల్లెంను అందరికంటే ఎక్కువగా 86.96 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం సాధించాడు. ఒలింపిక్స్ తర్వాత నీరజ్ కు ఇదే మొదటి స్వర్ణం. 
    
ఈ పోటీల్లో నీరజ్ తన మొదటి ప్రయత్నంలోనే విసిరిన త్రో తోనే బంగారు పతకం అందుకోవడం విశేషం. సాధారణంగా జావెలిన్ త్రోలో ఒక్కో క్రీడాకారుడు ఆరుసార్లు బల్లెంను విసరవచ్చు. కానీ, ఈ పోటీల సమయంలో వర్షం వల్ల మైదానం తడిగా మారింది. నీరజ్ రెండో ప్రయత్నంలో లైన్ దాటి ఫౌల్ చేశాడు. మూడో త్రో చేస్తున్నప్పుడు కాలు జారి కింద పడిపోయాడు. అదృష్టవశాత్తూ అతనికి గాయాలేమీ కాలేదు. చివరి మూడు త్రోలకు నీరజ్ దూరంగా ఉన్నాడు. 

 మిగతా పోటీదారులు ఆరు ప్రయత్నాలు చేసినా భారత క్రీడాకారుడికి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. కెషర్న్‌ వాల్కట్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో) 86.64 మీటర్ల దూరంతో రజతం నెగ్గగా, అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా) 84.75 మీటర్ల దూరంతో కాంస్యం సాధించాడు. నీరజ్ ఈ వారంలో ఫిన్లాండ్లోనే జరిగిన పావో నరుమి గేమ్స్‌‌‌‌లో 89.30 మీటర్ల దూరంతో తన పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ రజతం గెలిచాడు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
నాగపూర్ టెస్టులో ముగిసిన తొలి రోజు ఆట... టీమిండియాదే పైచేయి
 • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
 • తొలి ఇన్నింగ్స్ లో 177కి ఆలౌట్
 • జడేజాకు 5 వికెట్లు
 • ఆట చివరికి 1 వికెట్ నష్టానికి 77 పరుగులు చేసిన భారత్
 • క్రీజులో రోహిత్ శర్మ (56), అశ్విన్

ap7am

..ఇది కూడా చదవండి
నాగపూర్ టెస్టు: అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు... కుంబ్లే రికార్డు తెరమరుగు
 • భారత బౌలర్లలో వేగంగా 450 వికెట్లు తీసిన అశ్విన్
 • 89 టెస్టుల్లోనే ఈ ఘనత అందుకున్న వైనం
 • ఇప్పటివరకు కుంబ్లే పేరిట రికార్డు
 • 93 టెస్టుల్లో 450 వికెట్లు తీసిన కుంబ్లే

..ఇది కూడా చదవండి
పునరాగమనంలో జడేజా అదుర్స్... ఆసీస్ 177 ఆలౌట్
 • గాయం కారణంగా చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న జడేజా
 • ఆసీస్ తో తొలి టెస్టుతో మళ్లీ జట్టులోకి వచ్చిన వైనం
 • 5 వికెట్లతో సత్తా చాటిన లెఫ్టార్మ్ స్పిన్నర్
 • అశ్విన్ కు 3 వికెట్లు
 • భారత్ స్పిన్ దెబ్బకు ఆసీస్ విలవిల 


More Latest News
Phalana Abbayi Phalana Ammayi Movie Teaser Released
Once again Raja Singh bullet proof vehicle break down on road
Avika Interview
Jagga Reddy met CM KCR
JC Prabhakar Reddy released
Chandrababu reacts to police being filed cases against Nara Lokesh
Team India trying to tighten the grip in Nagpur test
PM Modi targets Congress party in his speech at Rajya Sabha
Sunil Interview
Chandrababu slams CM Jagan over AP Capital
Kotamreddy friend telling that phone not tapped says Kakani
Aswin gets his 450th wicket and set a record
Private schools managements met Nara Lokesh
Markets ends in profits
Modi speech in Rajya Sabha
..more