పోలీసు కస్టడీకి గ్యాంగ్ రేప్ నిందితుడు సాదుద్దీన్
08-06-2022 Wed 12:07
- గ్యాంగ్ రేప్ నిందితుల్లో సాదుద్దీన్ ఒక్కడే మేజర్
- సాదుద్దీన్‌ను 3 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చిన నాంపల్లి కోర్టు
- రేపు సాదుద్దీన్‌ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

హైదరాబాద్‌లో కలకలం రేపిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఉదయం తీర్పు చెప్పింది. కోర్టు ఆదేశాలతో రేపు ఉదయం సాదుద్దీన్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. మూడు రోజుల పాటు అతడిని పోలీసులు విచారించనున్నారు.
గ్యాంగ్ రేప్లో మొత్తం ఆరుగురు నిందితులు ఉండగా... వారిలో సాదుద్దీన్ ఒక్కడే మేజర్. మిగిలిన ఐదుగురు నిందితులు మైనర్లే. దీంతో సాదుద్దీన్‌ను మంగళవారం రాత్రి కోర్టు అనుమతితో జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు మిగిలిన ఐదుగురు మైనర్లను జ్యువెనైల్ హోంకు తరలించారు. తాజాగా కోర్టు అనుమతితో సాదుద్దీన్‌ను పోలీసులు రేపు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.
More Latest News
3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి హోం గార్డును!... ట్విట్టర్ హ్యాండిల్లో కొత్త వాక్యాన్ని చేర్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి!
10 minutes ago

పోలీసులకు దొరకవద్దని టెడ్డీబేర్ లో దాక్కుని.. ఓ దొంగ ప్లాన్.. కానీ బెడిసికొట్టింది!
11 minutes ago

ఆ వీడియో మార్ఫింగ్ చేసినదే... గోరంట్ల మాధవ్ వీడియోపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్య
23 minutes ago

ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నిన బండి సంజయ్... ఫొటోలు ఇవిగో
36 minutes ago

పొద్దున ఎనిమిదికి ముందు.. రాత్రి ఏడు తర్వాత కాల్స్ చేయొద్దు: లోన్ రికవరీ ఏజెంట్లకు రిజర్వు బ్యాంకు ఆదేశాలు
52 minutes ago

‘లాల్ సింగ్ చడ్డా’ను గుర్తించిన ఆస్కార్
1 hour ago
