మద్యం అమ్మకాలు అడ్డుకున్న వ్యక్తిపై గ్రామ బహిష్కరణ వేటు
30-05-2022 Mon 21:26
- శ్రీ బాలాజీ జిల్లా ఏర్పేడు మండలం కొత్త వీరాపురంలో ఘటన
- మద్యం విక్రయాలు నిలిపేయాలన్న మునికృష్ణారెడ్డి
- ఆయనను గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్లు గ్రామ పెద్దల ప్రకటన
- ఆ మేరకు గ్రామంలో దండోరా వేయించిన వైనం

ఏపీలో సోమవారం ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో మద్యం విక్రయాలు అడ్డుకున్న ఓ వ్యక్తిని ఆ గ్రామ పెద్దలు ఏకంగా గ్రామం నుంచి బహిష్కరించారు. శ్రీ బాలాజీ జిల్లా పరిధిలోని ఏర్పేడు మండలం కొత్త వీరాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామంలో మద్యం విక్రయించరాదని చెప్పిన మునికృష్ణారెడ్డి అనే వ్యక్తి.. గ్రామంలో మద్యం విక్రయాలను అడ్డుకున్నారట. దీంతో ఈ వ్యవహారంపై దృష్టి సారించిన గ్రామ పెద్దలు మద్యం విక్రయాలను అడ్డుకున్నందుకు మునికృష్ణారెడ్డిపై గ్రామ బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించారు. ఆ మేరకు సోమవారం గ్రామంలో దండోరా కూడా వేయించారు. ఈ ఘటనపై అటు పోలీసులకు గానీ, ఇటు ప్రభుత్వాధికారులకు గానీ మునికృష్ణారెడ్డి ఇప్పటిదాకా ఫిర్యాదు చేయలేదు.
More Latest News
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
3 hours ago

వీల్ చెయిర్ లో ఉండి కూడా ఆనంద పారవశ్యంతో డ్యాన్స్ చేసిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా... వీడియో ఇదిగో!
3 hours ago

మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుంది... అదే మనందరినీ ఒకటిగా కలుపుతుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
5 hours ago

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే... ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు
5 hours ago
