చంద్రబాబు నివాసం సమీపంలో చెట్లకు నిప్పు..కరకట్టపై ఆగిన ట్రాఫిక్
29-05-2022 Sun 12:25
- ఉండవల్లి పరిధిలో కరకట్టపై చంద్రబాబు నివాసం
- అక్కడికి సమీపంలోని చెట్లకు నిప్పు పెట్టిన వ్యక్తులు
- దట్టమైన పొగల కారణంగా నిలిచిన వాహనాల రాకపోకలు
ఏపీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న ఉండవల్లి సమీపంలో ఆదివారం చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఉండవల్లి పరిధిలోని కృష్ణా కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నివాసానికి అత్యంత సమీపంలో కరకట్టపై ఉన్న చెట్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఫలితంగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు వెలువడుతున్నాయి.
దట్టమైన పొగ కారణంగా కరకట్టపై ట్రాఫిక్కు తీవ్ర అంతకాయం కలిగింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉద్దేశపూర్వకంగానే గుర్తు తెలియని వ్యక్తులు చెట్లకు నిప్పు పెట్టారా?.. లేదంటే ప్రమాదవశాత్తు చెట్లకు మంటలు అంటుకున్నాయా? అన్న వివరాలు తెలియరాలేదు.
More Latest News
బెజవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ
3 minutes ago

మహారాష్ట్ర రాజకీయాలను 'కోతులాట'తో పోల్చిన ఒవైసీ
13 minutes ago

ఇతర దేశాల్లోను 'పుష్ప 2' చిత్రీకరణ!
1 hour ago
