వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే పేరిట బెజవాడ యువకుడి మోసం
28-05-2022 Sat 21:34
- ఆర్కే పేరిట విమాన టికెట్ల బుకింగ్
- గొల్లపుడికి చెందిన సాయి తేజ మోసం
- అరెస్ట్ చేసిన పోలీసులు

వైసీపీ కీలక నేత, గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరిట మోసానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడిని విజయవాడలోని గొల్లపూడికి చెందిన సాయి తేజగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే ఆర్కే పేరిట విమాన టికెట్లు బుక్ చేస్తూ నిందితుడు పట్టుబడ్డాడు.
గత కొంతకాలంగా కొనసాగుతున్న ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు... శనివారం నిందితుడిని విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
More Latest News
అప్పు తీసుకుని తనపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన నటుడు సాయికిరణ్
53 minutes ago

తెలంగాణలో 3 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
2 hours ago

ఇతర దేశాల్లోను 'పుష్ప 2' చిత్రీకరణ!
3 hours ago
