ఇంటిని మొత్తం దోచేసి.. ‘ఐ లవ్యూ’ అని రాసి వెళ్లిపోయిన దొంగ!
26-05-2022 Thu 08:38
- పర్యాటక ప్రదేశం గోవాలో ఘటన
- రూ. 20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ. 1.5 లక్షల నగదు చోరీ
- టీవీ స్క్రీన్‌పై ఐలవ్యూ అని రాసి వెళ్లిన దొంగ

ప్రముఖ పర్యాటక ప్రదేశమైన గోవాలో జరిగిన ఓ చోరీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ బంగళాలోకి చొరబడిన దొంగ అందినకాడికి దోచుకుని ‘ఐ లవ్యూ’ అని రాసి మరీ వెళ్లాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోవాకు చెందిన ఆసిబ్ జెక్ హాలీడేకు వెళ్లి రెండు రోజుల తర్వాత మంగళవారం ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వచ్చాక లోపల గదులు చిందరవందరగా ఉండడంతో అనుమానం వచ్చిన ఆయన ఇంటిని పరిశీలించి చూసి విస్తుపోయాడు.
ఇంట్లో ఉండాల్సిన రూ. 20 లక్షల విలువైన బంగారం, వెండి నగలతోపాటు రూ. 1.5 లక్షల నగదు చోరీకి గురైనట్టు గుర్తించి లబోదిబోమన్నాడు. అంతేకాదు, ఇంట్లోని టీవీ స్క్రీన్‌పై ‘ఐ లవ్యూ’ అని రాసి ఉండడాన్ని చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
More Latest News
దురదృష్టవశాత్తు పాక్ లో ధోనీ వంటి వ్యక్తులు లేరు... ఒకరు బాగా ఆడితే మా సీనియర్లు ఓర్వలేరు: పాక్ ఆటగాడు షేజాద్
7 minutes ago

దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో చెల్లాచెదురుగా మృతదేహాలు... ఎలా చనిపోయారన్నది మిస్టరీ!
22 minutes ago

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ’వై ప్లస్’ సెక్యూరిటీ
24 minutes ago

బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది... ఆత్మకూరులో ఓటింగ్ శాతమే అందుకు నిదర్శనం: విష్ణువర్ధన్ రెడ్డి
42 minutes ago

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు
1 hour ago

తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులు రద్దు.. దర్యాప్తు చేయాలంటూ మానవ హక్కుల సంఘానికి బండి సంజయ్ లేఖ
1 hour ago
