దావోస్‌లో గల్లా జయదేవ్!... కేటీఆర్‌తో కలిసి చర్చకు హాజరు!
25-05-2022 Wed 20:52
- దావోస్‌లో బిజీబిజీగా గల్లా జయదేవ్
- అమరరాజా బ్యాటరీస్ అధినేత హోదాలో సదస్సుకు హాజరు
- ఇండియాస్ గ్రోత్ స్టోరీ పేరిట సీఎన్‌బీసీ టీవీ18 చర్చా వేదిక
- కేటీఆర్, శోభనా కామినేనితో కలిసి హాజరైన గల్లా జయదేవ్

టీడీపీ యువ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో బిజీబిజీగా గడుపుతున్నారు. అమరరాజా బ్యాటరీస్ అధినేత హోదాలో దావోస్ సదస్సుకు హాజరైన గల్లా జయదేవ్... ఇదివరకే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో కలిసి ఓ చర్చా కార్యక్రమంలో పాలుపంచుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా బుధవారం తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి జయదేవ్ మరో కీలక చర్చలో పాలుపంచుకున్నారు. ఇండియాస్ గ్రోత్ స్టోరీ పేరిట సీఎన్‌బీసీ టీవీ18 నిర్వహించిన ఈ చర్చా వేదికలో కేటీఆర్ సహా తెలుగు నేలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త శోభనా కామినేని, భారత్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు సంజీవ్ బజాజ్, ఆశిష్ షాలతో కలిసి గల్లా జయదేవ్ పాల్గొన్నారు.
More Latest News
సోషల్ మీడియాలో నుపుర్ శర్మకు మద్దతు పలికాడని తల నరికివేత... ఉదయ్ పూర్ లో తీవ్ర ఉద్రిక్తత
53 minutes ago

ధర్మవరంలో ప్రెస్ మీట్ జరుగుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడిచేయడం సిగ్గుచేటు: విష్ణువర్ధన్ రెడ్డి
2 hours ago
