వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్
25-05-2022 Wed 18:54 | Andhra
- సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన అనంతబాబు
- ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఎమ్మెల్సీ
- ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటన
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ అనంత బాబును వైసీపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ బుధవారం సాయంత్రం కీలక ప్రకటన చేసింది. ఏపీలో కలకలం రేపిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన అనంతబాబు ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ హత్య కేసులో తన తప్పిదాన్ని అనంతబాబు ఒప్పుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా... న్యాయమూర్తి ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. సుబ్రహ్మణ్యం హత్యపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది.
More Latest News
మూడున్నరేళ్లుగా ఉద్యోగులు ఓపిక పట్టారు: బొప్పరాజు
24 minutes ago

నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి
2 hours ago

దేశంలో సమూల మార్పులు తీసుకొస్తాం: సీఎం కేసీఆర్
3 hours ago

పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు
4 hours ago

ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎం జగన్ దే: యనమల
4 hours ago
