రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు
25-05-2022 Wed 16:20
- నామినేషన్ వేసిన దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి
- అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పత్రాల అందజేత
- హాజరైన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
More Latest News
తెలంగాణ దోశకు మోదీ ఫిదా
4 minutes ago
