'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని పాటను పియానోపై వాయించిన పవన్ కల్యాణ్ తనయుడు
24-05-2022 Tue 18:03
- ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అకీరా
- వేడుకలకు హాజరైన పవన్ కల్యాణ్
- దోస్తీ పాటతో అందరినీ అలరించిన అకీరా
- పవన్ కు సరైన వారసుడు అంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సంగీతం నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. అకీరా ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా, సోమవారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అకీరా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని దోస్తీ పాటను పియానోపై వీనులవిందుగా పలికించాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అకీరా మ్యూజిక్ వీడియో నేపథ్యంలో పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
అకీరా... సంగీతంలోనే కాదు, తండ్రి బాటలో మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యం సంపాదిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన కర్రసాము, బాక్సింగ్ వీడియోలు పవన్ ఫ్యాన్స్ ను విశేషంగా అలరించాయి. పవన్ కు సరైన వారసుడు అంటూ అభిమానులు పొంగిపోతున్నారు.
More Latest News
అప్పు తీసుకుని తనపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన నటుడు సాయికిరణ్
46 minutes ago

తెలంగాణలో 3 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
2 hours ago

ఇతర దేశాల్లోను 'పుష్ప 2' చిత్రీకరణ!
2 hours ago
