రేవంత్ రెడ్డి ఒక లుచ్చా: మంత్రి మల్లారెడ్డి
24-05-2022 Tue 14:50
- రేవంత్, మల్లారెడ్డి మధ్య పేలుతున్న మాటల తూటాలు
- రేవంత్ ఒక బ్లాక్ మెయిలర్ అన్న మల్లారెడ్డి
- తన డబ్బుతోనే రేవంత్ కూతురి పెళ్లి చేశాడని వ్యాఖ్య

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న మల్లారెడ్డిపై రేవంత్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మల్లారెడ్డిని జైల్లో పెడతామని అన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ పై మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్ ఒక బట్టేబాజ్ అని, లుచ్చా అని అన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అవుతుందని చెప్పారు. రేవంత్ జీవితం అంతా బ్లాక్ మెయిలింగేనని అన్నారు.
మల్కాజ్ గిరి ఎంపీ సీటు కోసం తనను బ్లాక్ మెయిల్ చేశాడని.. డబ్బుల కోసం డిమాండ్ చేశాడని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోతే తన కాలేజీలను మూసేయిస్తానని రేవంత్ బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించారు. రాహుల్ గాంధీని కూడా రేవంత్ బ్లాక్ మెయిల్ చేసే రోజు వస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి ఆయన కూతురి పెళ్లిని తన డబ్బులతోనే చేశాడని చెప్పారు.
More Latest News
మహారాష్ట్ర రాజకీయాలను 'కోతులాట'తో పోల్చిన ఒవైసీ
9 minutes ago

తెలంగాణలో 3 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
57 minutes ago

ఇతర దేశాల్లోను 'పుష్ప 2' చిత్రీకరణ!
1 hour ago
