మామిడి పండ్లు మితం దాటితే అనర్థాలే!

24-05-2022 Tue 14:03
Mango Side Effects Eating Too Many Mangoes May Cause THESE Health Problems

ఇది మామిడి పండ్ల సీజన్. పండ్లలో మామిడిని రారాజుగానే చెబుతారు. మామిడి రుచి నచ్చని వారు బహుశా చాలా అరుదనే చెప్పుకోవాలి. ఈ నాలుగు రోజుల తర్వాత మళ్లీ మామిడి కనిపించదంటూ ఎక్కువ తినేసే వారు కూడా ఉంటారు. కానీ, మామిడి విషయంలో ‘అతి అనర్థదాయకం’ అనే సామెత అతుకుతుంది. 

మామిడిలో విటమిన్ ఏ, బీ, సీ, ఈ, కే తోపాటు మినరల్స్ కాపర్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. అంతేకాదు పేగులకు అవసరమైన పీచు కూడా మామిడి పండ్లలో ఉంటుంది. ఇది పేగుల్లో తిష్ట వేసిన మంచి బ్యాక్టీరియాకు అవసరం. కానీ పరిమితికి మించి తింటే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మామిడి పడని వారికి ఒక్క పండుతో అయినా ఈ అనుభవాలు ఎదురుకావచ్చు.

అలర్జీ
మామిడిలో ఉండే ప్రొటీన్లు కొందరికి పడకపోవచ్చు. చర్మంపై దురదలు, దద్దుర్లు, గొంతులో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తే మామిడి పండ్లను తినడం ఆపేయాలి.

రక్తంలో గ్లూకోజు పెరుగుతుంది
మధుమేహం ఉన్న వారు రక్తంలో గ్లూకోజు పరిమితి దాటిపోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అందుకని మధుమేహ సమస్యను ఎదుర్కొనేవారు రోజులో ఒక పండుకు మించి తినకుండా ఉండడమే మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండడం, చక్కెరలు కూడా ఉండడం వల్ల ఎక్కువ తింటే రక్తంలో గ్లూకోజు గణనీయంగా పెరుగుతుంది. 

డయేరియా
మామిడి పండ్లను ఎక్కువగా తిన్నప్పుడు సాధారణ రోజులతో పోలిస్తే ఒకటి రెండు సార్లు అదనంగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చిందంటే.. కచ్చితంగా అది మామిడి దోషమే అని భావించాలి. అంతేకాదు కొందరు ఒక పండు తిన్నా నీళ్ల విరేచనాలు అవుతాయి. అటువంటి వారు తినకుండా ఉండాలి. 

బరువు
ఒకటికి మించి మామిడి పండ్లను తింటే బరువు కూడా పెరగొచ్చు. ఒక మామిడి పండుతో సుమారు 201 కేలరీలు వస్తాయి. 

కృత్రిమంగా పండించినవి
మామిడి పండ్లను ఇప్పుడు హానికారక రసాయనాలతో మగ్గించి విక్రయిస్తున్నారు. వీటిని తినడం వల్ల కూడా కొందరిలో అలెర్జీలు, ఇతర దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఒక బకెట్ లో నీటిని పోసి మామిడి పండును అందులో వేయండి. మునిగిపోతే అది సహజ సిద్ధంగా పండినట్టు. పైన తేలితే అది కృత్రిమంగా పండించినట్టు అర్థం.

..Read this also
అధిక కొలెస్ట్రాల్ ఉందని చెప్పే సంకేతాలు ఇవే..
 • కాళ్లల్లో తిమ్మిర్లు, నొప్పులు, మంటలు
 • పుండ్లు పడి మానకపోవడం
 • చర్మం రంగు మారడం సంకేతాలే
 • వైద్యుల సలహాతో సమస్యకు పరిష్కారం


..Read this also
ఆహారంలో సూపర్​ ఫుడ్స్​ తీసుకోండి ఇలా.. ఆరోగ్యం మీ సొంతమవుతుంది
 • సులువుగా శరీరానికి అందించేలా నిపుణుల సూచనలు
 • శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని వెల్లడి
 • ఎనిమిది రకాలుగా తీసుకోవచ్చంటున్న నిపుణులు
 • దీర్ఘకాలికంగా ఉత్తమ ఫలితాలు ఉంటాయని స్పష్టీకరణ

..Read this also
గ్యాస్ ట్యాబ్లెట్లను అదే పనిగా మింగుతున్నారా..?.. అత్యంత ప్రమాదకరమంటున్న వైద్యులు
 • పీపీఐలతో 21 శాతం అధిక హార్ట్ ఎటాక్ రిస్క్
 • వైద్యులు సూచించిన కాలానికే వాడుకోవాలి
 • ఔషధ దుకాణం నుంచి తెచ్చుకుని ఇష్టారీతిన వాడుకోవద్దు
 • జీవనశైలి, ఆహారం కారణంగానే జీఈఆర్డీ సమస్య


More Latest News
Iam also facing same issues like Balineni says Kotamreddy Sridhar Reddy
Ukraine seeks powerful missile defense systems to tackle Russian attacks
Teenmar Mallanna satirical tweet on kcr and tamilisai meeting photo
amitabh bachchan met prabhas dulquer salmaan nani aamir
Russia bans Biden wife and daughter
budda venkanna fires on ycp govt and kodali nani
Women in the US are deleting period tracking apps from their phone why
Jagan deceived Minorities says Bonda Uma
kodali nani comments on 2024 and 2029 elections
Nara Lokesh take a swipe at YCP leaders
Surat Crime Branch nabbed some members of the Cheeklighar gang
Officers Choice whisky maker files draft papers for 2000 crore IPO
Mumbai Next Says Sena Rebel Chief Eknath Shinde
India to ban single use plastic from July 1
Mohan Babu leaves court
..more