'ఊ అంటావా మామ' లాంటి పాటల్లో నటిస్తారా? అనే ప్రశ్నకు సాయి పల్లవి సమాధానం ఇదే!

23-05-2022 Mon 17:58
Sai Pallavi says she will not do item songs

తన కెరీర్ ప్రారంభం నుంచి పలు వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ మంచి టాలెంటెడ్ నటిగా సాయి పల్లవి గుర్తింపు తెచ్చుకుంది. ఒక నటిగా తొలి నుంచి కూడా ఆమె కొన్ని పరిధులను విధించుకుంది. గ్లామర్ పాత్రలకు, ఎక్స్ పోజింగ్ కు ఆమె దూరంగా ఉంది. ఇప్పటి వరకు ఏ చిత్రంలో కూడా ఆమె స్కిన్ షో చేయలేదు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐటెం సాంగుల గురించి అడిగిన ఒక ప్రశ్నకు సాయిపల్లవి తనదైన శైలిలో సమాధానమిచ్చింది. 'పుష్ప' చిత్రంలో 'ఊ అంటావా మామ' పాట, 'రంగస్థలం' సినిమాలో 'జిగేలు రాణి' వంటి ఐటెం సాంగ్స్ లో అవకాశం వస్తే నటిస్తారా? అనే ప్రశ్న ఆమెకు ఎదురయింది. దీనికి సమాధానంగా... 'చేయను' అని స్పష్టంగా చెప్పేసింది. 

ఐటెం సాంగులు తనకు కంఫర్ట్ గా ఉండవని సాయి పల్లవి తెలిపింది. అలాంటి వాటిలో అవకాశం వచ్చినా చేయనని చెప్పేస్తానని స్పష్టం చేసింది. వస్త్రధారణ సరిగా లేకపోతే తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది. అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా తనకు లేదని తెలిపింది. జీవితానికి కెరీర్ ఎంత ముఖ్యమో ప్రేమ కూడా అంతే ముఖ్యమని... రెండింటిలో ఏది లేకపోయినా జీవితం సంపూర్ణం కాదని చెప్పింది.

..Read this also
'ది వారియర్' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!
  • రామ్ హీరోగా రూపొందిన 'ది వారియర్'
  • మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో సాగే కథ 
  • జులై 1వ తేదీన ట్రైలర్ రిలీజ్ 
  • జులై 14వ తేదీన సినిమా విడుదల


..Read this also
'సలార్' కోసం యాక్షన్ ఎపిసోడ్ తో బిజీగా ఉన్న ప్రభాస్!
  • హైదరాబాదులో షూటింగు జరుపుకుంటున్న 'సలార్'
  • ప్రభాస్ తదితరులపై యాక్షన్ సీన్స్ చిత్రీకరణ 
  • డిఫరెంట్ గా డిజైన్ చేయించిన ప్రశాంత్ నీల్ 
  • కథానాయికగా సందడి చేయనున్న శ్రుతి హాసన్

..Read this also
ప్రభాస్ హీరో అవుతాడని ముందే అనుకున్నాను: గోపీచంద్
  • 'పక్కా కమర్షియల్' ప్రమోషన్స్ లో గోపీచంద్
  • తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ ప్రస్తావన
  • 'వర్షం'  సినిమాకి ముందే తాము స్నేహితులమంటూ వ్యాఖ్య 
  • మరోసారి కలిసి నటిస్తామన్న గోపీచంద్  


More Latest News
Telangana corona media report
ias p rajababu posted as ap transport commissioner
World biggest fresh water fish found in Mekong river
ap deputy cm narayana swamy viral comments on jagan
hardik pandya won the toss and elect to bat first
Death toll rises in Mumbai building collapse
ghmc alerts people in view orf heavy rains in hyderabad
Eoin Morgan announces retirement for international cricket
ap cm ys jagan takeoff in a special flight to paris
Man beheaded by two men in Udaypur
ap minister adimulapu suresh hits back tdp allegations on amaravati lands sale
ap government employees alleges cash in their pf accounts withdrawn with out their consent
Center alerts states and union territories in the wake of corona spreading
The Warrior Movie Update
Telangana High Court rejects minister Koppula Eshwar plea
..more