రైలెక్కిన బస్సులు... వీడియో ఇదిగో!
22-05-2022 Sun 19:44
- గూడ్స్ రైళ్లలో బస్సుల రవాణా
- బెంగళూరు నుంచి చండీగఢ్ కు 300 బస్సుల తరలింపు
- అశోక్ లేలాండ్ ప్లాంట్లలో తయారైన బస్సులు
- బస్సులను కొనుగోలు చేసిన హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ
- రైల్లో చవకగా రవాణా

సాధారణంగా గూడ్స్ రైళ్లలో బైకులు, ట్రాక్టర్లు తరలించడం చూస్తుంటాం అప్పుడప్పుడు. అయితే దేశంలో తొలిసారిగా ఆర్టీసీ బస్సులను గూడ్స్ రైలులో రవాణా చేశారు. బెంగళూరు నుంచి చండీగఢ్ కు ఈ బస్సులను తరలించారు. ఈ బస్సులు హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందినవి. మొత్తం 300 బస్సులను రైలు మార్గం ద్వారా రవాణా చేశారు.
ఈ బస్సులు బెంగళూరు, హోసూరులోని అశోక్ లేలాండ్ యూనిట్లలో తయారయ్యాయి. వీటిని రోడ్డు మార్గంలో తరలించాలంటే ఎంతో వ్యయం అవుతుంది. దేశంలో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, రైలు మార్గం ద్వారా చాలా చవకగా రవాణా చేయవచ్చని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన వందలాది బస్సులను రైల్లో తరలించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ లో పంచుకున్నారు.
More Latest News
తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడిన మధ్యప్రదేశ్ జట్టు... ఫైనల్లో ముంబయి జట్టుపై గ్రాండ్ విక్టరీ
34 minutes ago

ఇది బీజేపీ చిల్లర రాజకీయాలకు ఎదురుదెబ్బ: కేజ్రీవాల్
42 minutes ago

దురదృష్టవశాత్తు పాక్ లో ధోనీ వంటి వ్యక్తులు లేరు... ఒకరు బాగా ఆడితే మా సీనియర్లు ఓర్వలేరు: పాక్ ఆటగాడు షేజాద్
57 minutes ago

బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది... ఆత్మకూరులో ఓటింగ్ శాతమే అందుకు నిదర్శనం: విష్ణువర్ధన్ రెడ్డి
1 hour ago

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు
2 hours ago

తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులు రద్దు.. దర్యాప్తు చేయాలంటూ మానవ హక్కుల సంఘానికి బండి సంజయ్ లేఖ
2 hours ago
