వాహనదారులకు కేంద్రం శుభవార్త... భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
21-05-2022 Sat 19:05
- దేశంలో భగ్గుమంటున్న పెట్రో ధరలు
- కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
- పెట్రోల్ పై రూ.8 ఎక్సైజ్ సుంకం తగ్గింపు
- డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గింపు

దేశంలో గత కొన్నాళ్లుగా పెట్రో ధరలు పైపైకి దూసుకెళ్లడం తెలిసిందే. పెట్రోల్ లీటర్ రూ.120 వరకు ఉండగా, డీజిల్ లీటర్ రూ.105 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తద్వారా లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 మేర తగ్గనుందని, లీటర్ డీజిల్ ధర రూ.7 మేర తగ్గనుందని వివరించారు.
ఇటీవల మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 మధ్య కాలంలో పెట్రో ధరలను 14 సార్లు పెంచారు. తద్వారా లీటర్ పై గరిష్ఠంగా రూ.10 వరకు పెరిగింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులకు ఊరట కలగనుంది.
More Latest News
ఇది వినడానికే సిగ్గుగా ఉంది: విజయశాంతి
7 hours ago

తెలంగాణలో తాజాగా 477 కరోనా పాజిటివ్ కేసులు
7 hours ago
