శుభ్ మాన్ గిల్ కు కోహ్లీ వార్నింగ్... వీడియో ఇదిగో!

20-05-2022 Fri 19:20
Kohli warns Gill

మైదానంలో దిగిన తర్వాత విరాట్ కోహ్లీ టెంపర్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటలోనే కాదు, మాటల్లోనూ, చేతల్లోనూ కోహ్లీ దూకుడు ప్రదర్శిస్తుంటాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు ఎవరైనా సరే లెక్కచేయని మనస్తత్వం కోహ్లీది. మాటకు మాట బదులివ్వడం, మైదానంలో గొడవకు దిగేందుకైనా వెనుకాడకపోవడం కోహ్లీ నైజం. నిన్న జరిగిన బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లోనూ ఈ విషయం స్పష్టమైంది. 

ఈ మ్యాచ్ లో గుజరాత్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్ మాన్ గిల్ పై కోహ్లీ స్లెడ్జింగ్ కు దిగాడు. గిల్ ను చూస్తూ "చంపేస్తా" అన్నట్టుగా సంజ్ఞ చేశాడు. అచ్చం... డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్ లో అండర్ టేకర్ చేసినట్టు చేశాడు. దాంతో గిల్ కూడా కోహ్లీ వైపు సీరియస్ గా చూస్తూ వెళ్లిపోయాడు. 

కాగా, ఈ మ్యాచ్ లో కోహ్లీ వీరోచితంగా ఆడి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించడం తెలిసిందే. కోహ్లీ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. దాంతో 169 పరుగుల విజయలక్ష్యాన్ని బెంగళూరు 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా, ఈ మ్యాచ్ లో గుజరాత్ మొదట బ్యాటింగ్ చేయగా, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ కేవలం ఒక్క పరుగుకే అవుటయ్యాడు.

..Read this also
సచిన్ తనయుడి ఫొటో షేర్ చేసిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్
  • ప్రస్తుతం ఇంగ్లండ్ లో ఉన్న అర్జున్ టెండూల్కర్
  • నండోస్ రెస్టారెంట్ లో దర్శనం
  • బుజ్జి మిత్రుడు అంటూ పేర్కొన్న డానియెల్లే వ్యాట్


..Read this also
ఐర్లాండ్‌తో రెండో టీ20... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాండ్యా
  • రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో టీమిండియా
  • ఐర్లాండ్ నెగ్గితే స‌మం కానున్న సిరీస్‌
  • తుది జ‌ట్టులో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు

..Read this also
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్
  • ఇంగ్లండ్ కు చిరస్మరణీయ విజయాలు అందించిన మోర్గాన్
  • మోర్గాన్ కెప్టెన్సీలో ప్రబలశక్తిగా ఇంగ్లండ్
  • వన్డేలు, టీ20ల్లో మేటి జట్టుగా ఎదిగిన వైనం
  • ఇటీవల ఫామ్ లో లేని మోర్గాన్


More Latest News
Pawan Kalyan will start Jana Vani in Vijayawada
ab venkateswara rao suspended from services again
England woman cricketer Danny Wyatt shares Arjun Tendulker pic
Telangana corona media report
ias p rajababu posted as ap transport commissioner
World biggest fresh water fish found in Mekong river
ap deputy cm narayana swamy viral comments on jagan
hardik pandya won the toss and elect to bat first
Death toll rises in Mumbai building collapse
ghmc alerts people in view orf heavy rains in hyderabad
Eoin Morgan announces retirement for international cricket
ap cm ys jagan takeoff in a special flight to paris
Man beheaded by two men in Udaypur
ap minister adimulapu suresh hits back tdp allegations on amaravati lands sale
ap government employees alleges cash in their pf accounts withdrawn with out their consent
..more