కేన్స్ లో పూజా హెగ్డేకి చేదు అనుభవం... ఏం జరిగిందంటే...!

20-05-2022 Fri 18:53
Pooja Hegde lost her baggage ahead of Cannes Red Carpet formality

దక్షిణాది చిత్రాల్లో నటిస్తూ విజయవంతమైన హీరోయిన్ గా పేరుగాంచిన కన్నడ బ్యూటీ పూజా హెగ్డే ప్రఖ్యాత కేన్స్ చలనచిత్రోత్సవంలో తళుక్కుమంది. తొలిసారిగా కేన్స్ లో రెడ్ కార్పెట్ పై నడిచి మురిసిపోయింది. అయితే, కేన్స్ లో అమ్మడికి ఊహించని అనుభవం ఎదురైంది. తన బృందంతో సహా భారత్ నుంచి బయల్దేరి కేన్స్ వచ్చిన పూజా హెగ్డే... అనుకోని రీతిలో తన దుస్తులు, ఫ్యాషన్ నగలు, మేకప్ సామాన్లు పోగొట్టుకుంది. ఈ విషయాన్ని పూజానే స్వయంగా వెల్లడించింది. 

"మేం అన్నీ పోగొట్టుకున్నాం. ఫ్యాషన్ దుస్తులు, మేకప్ కిట్లు ఏవీ లేకుండా పోయాయి. కేన్స్ లో దిగామో లేదో మాపై బండ పడినట్టు అయింది. బాధపడేందుకు కూడా సమయంలేని పరిస్థితి. వెంటనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ వాకింగ్ కు సిద్ధం కావాల్సి ఉంది. ఈ పరిణామంతో నాకంటే మా మేనేజర్ ఎక్కువగా ఆందోళనకు గురయ్యారు. నేనైతే... జరిగిందేదో జరిగిపోయింది అనుకున్నాను. అయితే నాతో పాటే కొన్ని ఒరిజినల్ నగలను ఉంచుకోవడం ఊరట కలిగించే అంశం. దాంతో కేన్స్ లోనే దుస్తులు తెప్పించుకుని మేనేజ్ చేశాను. 

ఈ సందర్భంగా నా టీమ్ కనీసం భోజనం కూడా చేయలేదు. నేను రెడ్ కార్పెట్ వాకింగ్ పూర్తి చేసేవరకు వాళ్లు పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. అన్నీ పోయాయని తెలియగానే వాళ్లు హుటాహుటీన వెళ్లి దుస్తులు, మేకప్ సామాన్లు, కొత్త హెయిర్ ప్రొడక్టులు తీసుకువచ్చి నన్ను సిద్ధం చేశారు. నేనైతే ఆ రోజు తిండి తినేసరికి రాత్రి వేళైంది. ఓవైపు నా హెయిర్ స్టయిలిస్ట్ కి ఫుడ్ పాయిజనింగ్ కావడం మరో బాధాకరమైన అంశం. అయినప్పటికీ కేన్స్ రెడ్ కార్పెట్ మీద నేను అందంగా కనిపించేందుకు వారు ఎంతో శ్రమించారు. నేను కేన్స్ రెడ్ కార్పెట్ పై అడుగుపెట్టానంటే అది వాళ్ల వల్లే" అని పూజా హెగ్డే వివరించింది.

..Read this also
ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు!
  • తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్ష సూచన
  • నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు
  • ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం 


..Read this also
సల్మాన్ ఖాన్, పూజ హెగ్డేలకు తన ఇంట్లో ఆతిథ్యమిచ్చిన రామ్ చరణ్
  • 'కభీ ఈద్ కభీ దివాలీ' చిత్రంలో నటిస్తున్న సల్మాన్
  • పూజ హెగ్డే కథానాయిక
  • హైదరాబాదులో షూటింగ్
  • సల్మాన్, పూజాలను ఆహ్వానించిన చరణ్

..Read this also
రైల్వే స్టేషన్​ విధ్వంసం కేసులో కావాలనే ఇరికించారు.. బెయిల్​ పిటిషన్​ లో ఆవుల సుబ్బారావు
  • నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు
  • విధ్వంసంతో తనకేం సంబంధం లేదన్న సుబ్బారావు 
  • ఆర్మీలో సేవ చేసేలా యువకులను ప్రోత్సహించినట్టు వెల్లడి


More Latest News
KCR in Governor Tamilisai tea party
nasas lunar reconnaissance orbiter spots rocket impact site on moon
Modi leaves Germany and off to UAE
RS praveen kumar slams govt over food poison incidents in gurukula schools
Adivi Sesh and Sukumar praise director Deepak as his Telugu short film Manasanamaha enters Guinness Records
China brings corona cases under control eases sanctions in Shanghai and Beijing
Retailing at 3 lakh per kg which is the most expensive mango in world All you need to know
Cyber crime police writes Google to remove 221 loan apps from playstore
Mr Happy Face who received the Worlds Ugliest Dog award
English photographer reacts after Virat Kohli uses three of his photos on own Twitter handle
India vs Ireland 2nd T20I tonight
PV Narasimha Rao is inspiration to us says KCR
Three persistent signs of high cholesterol that show in the feet
England clean sweeps test series against world no one New zealand
Shapoorji Pallonji Group head Pallonji Mistry passes away
..more