టాలీవుడ్ నటుడు చలపతి చౌదరి కన్నుమూత!
20-05-2022 Fri 13:54
- గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతి చౌదరి
- కర్ణాటకలోని రాయచూరులో మృతి
- వందకు పైగా చిత్రాల్లో నటించిన చలపతి చౌదరి

ప్రముఖ సినీ నటుడు చలపతి చౌదరి కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... కర్ణాటకలోని రాయచూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విజయవాడకు చెందిన చలపతి చౌదరి రాయచూరులో స్థిరపడ్డారు.
చలపతి చౌదరి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, శివరాజ్ కుమార్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలను పోషించారు. ఇటీవల ఘన విజయం సాధించిన బాలకృష్ణ 'అఖండ' చిత్రంలో కూడా నటించారు. పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మరోవైపు చలపతి మృతి పట్ల సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.
More Latest News
చిత్తూరు మాజీ మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారు: డీజీపీకి చంద్రబాబు లేఖ
1 minute ago

ఆరోగ్య బీమా ఏ వయసులో తీసుకోవాలి..?
15 minutes ago

ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
37 minutes ago

ఉద్ధవ్ థాకరే గూండాయిజం అంతం కావాలి.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి: నవనీత్ కౌర్
58 minutes ago

ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
1 hour ago
