ప్యాక్ యువర్ బ్యాగ్స్!... ఏపీ సీఎంపై తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ట్వీట్!
19-05-2022 Thu 20:37
- జగన్‌ను వృద్ధుడిగా అభివర్ణించిన అనిత
- అలసటన్నదే ఎరుగని నేతగా చంద్రబాబుకు కితాబు
- నీ ఖేల్ ఖతమంటూ జగన్‌పై పవర్ ఫుల్ పంచ్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో కూడిన ట్వీట్‌ను సంధించారు. జగన్ రెడ్డీ... ప్యాక్ యువర్ బ్యాగ్స్, నీ ఖేల్ ఖతం అంటూ ఆమె గురువారం ఓ ట్వీట్‌ను సంధించారు.
'151 ఎమ్మెల్యేలు ఉండి పరదాలు, బ్యారికేడ్లు లేకుండా బయట కాలు పెట్టలేని యువ నాయకుడని పిలవబడే వృద్ధుడు ఒక వైపు, అర్ధరాత్రి అవుతున్నా అశేష జన సందోహం ప్రేమాభిమానాల మధ్య అలసట లేని ముఖంతో ఠీవీగా నా నాయకుడు. చచ్చేంత ప్రేమ ఉన్న ఈ జనం సాక్షిగా.. జగన్ రెడ్డీ! ప్యాక్ యువర్ బ్యాగ్స్. నీ ఖేల్ ఖతం' అంటూ అనిత ట్వీట్ చేశారు. దీంతోపాటుగా అశేష జనం మధ్య చంద్రబాబు వున్న వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు.
More Latest News
ద్రౌపది ముర్ముపై మరోసారి వ్యాఖ్యలు చేసిన వర్మ
9 minutes ago

బెజవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ
21 minutes ago

ఇతర దేశాల్లోను 'పుష్ప 2' చిత్రీకరణ!
2 hours ago
