'ఎఫ్-3' సినిమా టికెట్ల ధరలు పెంచడంపై స్పష్టతనిచ్చిన దిల్ రాజు
18-05-2022 Wed 14:00
- ఈ నెల 27న 'ఎఫ్-3' సినిమా విడుదల
- ఈ సినిమా టికెట్ ధరలను పెంచడం లేదన్న రాజు
- ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయిస్తామని వ్యాఖ్య

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్-3' సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విడుదల సమయంలో ఈ సినిమా టికెట్ ధరలు పెంచే అంశంపై నిర్మాత దిల్ రాజు స్పష్టత నిచ్చారు. ఈ సినిమా టికెట్ ధరలను పెంచడం లేదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే తాము ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు. ఇటీవల విడుదలైన పలు పెద్ద సినిమాల టికెట్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే.
కాగా, డబ్బు వల్ల వచ్చే అనర్థాలు అనే కథనంతో 'ఎఫ్-3' సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో పొల్గొంటోంది.
More Latest News
శ్రీకాకుళంలో అమ్మ ఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
3 minutes ago

ప్రకృతి విరుద్ధమైన బంధం వద్దన్నారని లింగమార్పిడి
19 minutes ago

రామ్చరణ్-శంకర్ సినిమాకు టైటిల్ ఇదేనా!
23 minutes ago

శివసేనకు మరో షాక్.. సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు
35 minutes ago

రామ్ హీరోగా హరీశ్ శంకర్ సినిమా!
2 hours ago
