ఢిల్లీకి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి... ఎందుకోసమంటే..!
16-05-2022 Mon 20:37
- కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు
- 2, 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న మాజీ సీఎం
- సోనియా, రాహుల్, కీలక నేతలతో భేటీ అయ్యే అవకాశం
- ఏపీలో పార్టీ పటిష్ఠతపై చర్చించే ఛాన్స్

ఉమ్మడి ఏపీ చిట్టచివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చిన కారణంగానే ఆయన ఢిల్లీకి వెళుతున్నారని ప్రచారం సాగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ టూర్కు సంబంధించి స్పష్టమైన వివరాలు లేకున్నా... త్వరలోనే ఆయన ఢిల్లీ వెళ్లనున్నారని, అక్కడ రెండు నుంచి మూడు రోజుల పాటు ఉండనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి సంబంధించి ఆయనతో పార్టీ అధిష్ఠానం చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.
More Latest News
అప్పు తీసుకుని తనపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన నటుడు సాయికిరణ్
57 minutes ago

తెలంగాణలో 3 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
2 hours ago

ఇతర దేశాల్లోను 'పుష్ప 2' చిత్రీకరణ!
3 hours ago
