మీడియా ప్రతినిధికి వైసీపీ ఎమ్మెల్యే అవంతి బెదిరింపు!
16-05-2022 Mon 20:04
- కోరాడలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం
- ఏం పని చేస్తున్నావయ్యా అంటూ ఎస్సైపై అవంతి అసహనం
- సోషల్ మీడియాలో సదరు ఘటన వీడియో వైరల్

వైసీపీ కీలక నేత, ఏపీ మాజీ మంత్రి, విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఓ మీడియా ప్రతినిధిని బెదిరించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. నీ సంగతి చూస్తానంటూ వేలు చూపించి మరీ ఆయన మీడియా ప్రతినిధిని బెదిరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే... భీమిలి పరిధిలోని పద్మనాభం మండలం కోరాడలో సోమవారం రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ ఎమ్మెల్యేగా హాజరైన అవంతి... మీడియా ప్రతినిధులతో పాటు పోలీసు సిబ్బందిపైనా అసహనం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న ఓ ఎస్సైని పట్టుకుని ఏం పని చేస్తున్నావయ్యా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన ఓ మీడియా ప్రతినిధిని ఆయన బెదిరించారు.
More Latest News
అప్పు తీసుకుని తనపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన నటుడు సాయికిరణ్
38 minutes ago

ద్రౌపది ముర్ముపై మరోసారి వ్యాఖ్యలు చేసిన వర్మ
53 minutes ago

తెలంగాణలో 3 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
2 hours ago

ఇతర దేశాల్లోను 'పుష్ప 2' చిత్రీకరణ!
2 hours ago
