ఆ రోజునే మహేశ్ .. త్రివిక్రమ్ మూవీ లాంచ్?

16-05-2022 Mon 17:22
Mahesh Babu in Trivikram Movie

మహేశ్ బాబు తాజా చిత్రంగా వచ్చిన 'సర్కారువారి పాట' సినిమా, ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. తొలి రోజునే రికార్డుస్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఓవర్సీస్ లోను ఈ సినిమా గట్టి వసూళ్లనే రాబడుతోంది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో కలిసి మహేశ్ బాబు సెట్స్  పైకి వెళ్లనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

త్రివిక్రమ్ - మహేశ్ బాబు సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని కొంతమంది వెయిట్ చేస్తుంటే, మరి కొంతమంది ఈ సినిమాకి ఏ టైటిల్ పెట్టనున్నారనే విషయంలో కుతూహలాన్ని వ్యక్తం చేస్తున్నారు. జులైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఇక ఈ నెల 31వ తేదీన ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నట్టు  తెలుస్తోంది. 

ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు .. ఈ సందర్భంగా మహేశ్ బాబు 28వ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నట్టు చెబుతున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాలో, మహేశ్ జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

..Read this also
నాగచైతన్య ‘థాంక్యూ’ రెండు వారాలు వెనక్కి
  • జులై 8 నుంచి  జులై 22కి వాయిదా పడిన విడుదల
  • విజయ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న  థాంక్యూ’
  • హీరోయిన్లుగా రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ 


..Read this also
'స్వాతిముత్యం' నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్!
  • విభిన్నమైన ప్రేమకథగా 'స్వాతిముత్యం'
  • కథానాయకుడిగా బెల్లంకొండ గణేశ్ పరిచయం 
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
  • ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు 

..Read this also
హిందీ రీమేక్ దిశగా 'భీమ్లా నాయక్'
  • మలయాళంలో హిట్ కొట్టిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్'
  • తెలుగు రీమేక్ గా వచ్చిన 'భీమ్లా నాయక్'
  • హిందీ రీమేక్ కోసం సన్నాహాలు 
  • జాన్ అబ్రహం హీరోగా సెట్స్ పైకి 
  • అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగు


More Latest News
Politicians live average 4 5 years longer general public study finds
Gold price tumbles over RS 1000 in a week Is this dip a buying opportunity
ThankYou Movie in Theatres on July 22nd
I Will Create A New Shiv Sena says Uddhav Thackeray
He fought for 19 years braved pain Shah defends Modi after Guj riots verdict
Swathi Muthyam song promo released
England spinner adil rashid is out of white ball series against india
Rishabh Pant joins celebration of own wicket after Ravindra Jadejas reaction in India vs Leicestershire warm up
John Abraham New Movie Update
Puttaparthi municipal commissioner suicide
Brand Ambassador for Destruction is YS Jagan says Nara Lokesh
Hyderabad pubs ramp up vigil slam door on under 21 years
Chor Bazaar movie update
AP High Court rejects Raghu Rama Krishna Raju petition
India reports 15940 fresh cases and 20 deaths in the last 24 hours
..more