రాయలసీమ జిల్లాల్లో గవర్నర్... తిరుమల వెంకన్న సేవలో బిశ్వభూషణ్ హరిచందన్
14-05-2022 Sat 19:44
- అనంత జేఎన్టీయూ స్నాతకోత్సవానికి హాజరు
- ఆ తర్వాత శ్రీ బాలాజీ జిల్లాకు పయనం
- రేణిగుంటలో గవర్నర్కు కలెక్టర్ స్వాగతం
- సతీసమేతంగా వెంకన్న సేవలో గవర్నర్

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ రోజు రాయలసీమ జిల్లాల్లో పర్యటించారు. విజయవాడ నుంచి బయలుదేరి అనంతపురం చేరుకున్న ఆయన... అక్కడ జేఎన్టీయూ స్నాతకోత్సవంలో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత అటు నుంచి అటే ఆయన శ్రీ బాలాజీ జిల్లాకు వెళ్లారు. తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి స్వాగతం పలికారు.
ఆ తర్వాత తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న గవర్నర్కు టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డి, వేద పండితులు స్వాగతం పలికారు. కాసేపటి క్రితం తిరుమల వెళ్లిన ఆయన సతీసమేతంగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు.
More Telugu News
తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్
3 hours ago
