అస్సలు తగ్గొద్దు!... అంబటికి అయ్యన్న కౌంటర్!
12-05-2022 Thu 21:03 | Andhra
- అంబటి, అయ్యన్నల మధ్య ట్వీట్ వార్
- తగ్గేదేలే అంటూ అంబటి ట్వీట్
- మేమూ తగ్గబోమంటూ అయ్యన్న రీ ట్వీట్

వైసీపీ కీలక నేత, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు... టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య ట్వీట్ వార్ కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం వీరిద్దరి మధ్య మొదలైన ట్వీట్ వార్.., గురువారం మరింతగా వేడెక్కింది. టీడీపీ బెదిరింపులకు తగ్గేదే లేదంటూ అంబటి ట్వీట్ చేయగా.. అస్సలు తగ్గొద్దు అంటూ అంబటికి అయ్యన్న కౌంటర్ ఇచ్చారు.
అంబటి ట్వీట్‌కు స్పందించిన అయ్యన్న... "నువ్వంత సంబర పడితే మేము మాత్రం తగ్గుతామా? నువ్వు తగ్గోదు అంబటి రెచ్చిపో. నీకో హింట్... వైసీపీ, బ్లూ మీడియా కలిసే నిన్ను ఇంటికి పంపబోతున్నారు. ఇక నువ్వు పాత మెసేజ్ లు వెతుక్కునే పనిలో ఉండు, అస్సలు తగ్గొద్దు" అంటూ కౌంటర్ ట్వీట్ పోస్ట్ చేశారు.
More Latest News
ఈసారి మేనేజర్ల వంతు.. వేటుకు సిద్ధమైన జుకర్‌బర్గ్!
16 minutes ago

బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
8 hours ago

వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
9 hours ago

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల
11 hours ago

కడప జిల్లా గండికోటలో కమలహాసన్ సందడి
12 hours ago
