కాపులందరూ పవన్ పాటపాడుతుంటే.. ఆయనేమో చంద్రబాబు జపం చేస్తున్నారు: ఏపీ మంత్రి అంబటి

12-05-2022 Thu 09:03
Minister Ambati Fires on Pawan and Chandrababu

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో నిన్న నిర్వహించిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాపులందరూ పవన్, పవన్ అని అంటుంటే, ఆయనేమో చంద్రబాబు జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పనిలోపనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. 

చంద్రబాబు తాను వెంటనే సీఎం కావాలని  అనుకుంటున్నారని, అందుకనే క్విట్ జగన్ అని అంటున్నారని అన్నారు. చంద్రబాబు ప్రజలకు మేలు చేసి ప్రధానమంత్రి అయినా తమకు అభ్యంతరం లేదన్న అంబటి.. పవన్, సీపీఐ, బీజేపీ మెడలపై కూర్చుని అధికారంలోకి రావాలని ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జగన్ సింహంలా ఒంటరిగా ఎన్నికలకు సిద్ధమయ్యారని అన్నారు. తమ ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల్లో ప్రజలకు రూ.1.39 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చిందని, రానున్న రెండేళ్లలో మరో లక్ష కోట్ల రూపాయలను అందిస్తుందని అంబటి వివరించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వినియోగిస్తే రూ.5 వేల జరిమానా.. నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కారు
  • సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నూతన జరిమానాలు
  • సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు జరిమానా
  • మాల్స్ పైనా రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఫైన్ విధించే అవకాశం

ap7am

..ఇది కూడా చదవండి
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: బీసీ మహాసభ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో విజయసాయి
  • ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేశ్ కి భవిష్యత్తు ఉండదన్న విజయసాయి 
  • బీసీలకు జగన్ పెద్దపీట వేశారని వెల్లడి 
  • మరో 25 ఏళ్లు జగనే సీఎం అంటూ వ్యాఖ్య 

..ఇది కూడా చదవండి
సీఎం జగన్ ను కలిసిన కొత్త సీఎస్
  • నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి నియామకం
  • మర్యాదపూర్వకంగా జగన్ ను కలిసిన జవహర్ రెడ్డి
  • 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి


More Latest News
Roja fires on Chandrababu
ap police registers a case against ysrcp leader varupula subbarao
Varla Ramaiah slams Vijayasai Reddy
BRS rattled BJP says Kavitha
Huge family attracts in Gujarat elections
cbi issues notices to 4 hydarabady vusinessmen in fake cbi officer case
Stock markets touches new heights
ap government hikes penalries on single use plastic
Nakka Anand Babu fires over CV Subba Reddy appointment as new ENC
Poonam Kaur in suffering from rare decease
cpi telangana secretary kunamneni comments on political alliances
Jharkhand High Court gives nod to 15 years old girl marriage
ap minister jayaram responds on it notices to his wife
No alcohol for Delhi people for 3 days
Indian takes on G20 presidency today
..more