వంటింట్లో మంట.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!
07-05-2022 Sat 09:24
- ఉదయాన్ని చేదు వార్తను వినిపించిన చమురు సంస్థలు
- గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచుతున్నట్టు ప్రకటన
- రూ. 1,052కి చేరుకున్న సిలిండర్ ధర

ఇప్పటికే అన్ని ధరలు పెరిగి అల్లాడుతున్న సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడింది. ఈ ఉదయాన్నే సామాన్య ప్రజలకు గుండె గుభేల్ మనిపించే చేదు వార్తను చమురు సంస్థలు వినిపించాయి. గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచుతున్నట్టు ప్రకటించాయి. పెరిగిన ధరతో సిలిండర్ ధర రూ. 1,052కి చేరుకుంది. పెరిగిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాయి. ఇటీవలే 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను కూడా చమురు సంస్థలు పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన ధరతో వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,460 నుంచి రూ. 2,563.50కి చేరుకుంది.
More Latest News
మూవీ రివ్యూ: 'కార్తికేయ 2'
8 hours ago

తెలంగాణలో తాజాగా 440 మందికి కరోనా పాజిటివ్
9 hours ago

వరల్డ్ చాంపియన్ షిప్‌కు పీవీ సింధు దూరం... కారణం చెబుతూ భావోద్వేగానికి గురైన స్టార్ షట్లర్
9 hours ago

విజయనగరం జిల్లాలో పాత ఇల్లు కూల్చుతుండగా బయటపడిన లాకర్... మాదంటే మాదని యజమాని, కూలీల మధ్య వివాదం
10 hours ago
