/

త్వరలోనే శుక్రగ్రహంపైకి ప్రయోగం.. వెల్లడించిన ఇస్రో చైర్మన్

04-05-2022 Wed 14:40
Plan Ready For Venus Mission Says ISRO Chairman Somnath

సౌర మండలంలోనే అత్యంత వేడి గ్రహం శుక్రుడు (వీనస్). మన భూమికి కవల గ్రహం, పొరుగు గ్రహం అనీ దానిని పిలుస్తుంటారు. ఒకప్పుడు మన భూమ్మీద ఉండే వాతావరణమే దానిపైనా ఉండేదని శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు. కానీ, ఆ తర్వాత గ్రహం తీవ్రమైన వేడిగా మారిందని చెబుతారు. అంతేకాదు.. దట్టమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలతో అత్యంత విషపూరితమైన గ్రహంగానూ దానికి పేరుంది. 

దానికి గల కారణాలేంటన్నది ఇప్పటికీ రహస్యాలే. ఆ రహస్యాల్నే ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధమైంది. శుక్ర గ్రహ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. అంతరిక్ష ఆధారిత అధ్యయనాలు, పరిశోధనలపై ఇవాళ ఇస్రోలో చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడారు. 

అతి త్వరలోనే శుక్ర గ్రహం ప్రయోగం చేపట్టనున్నామని స్పష్టం చేశారు. ఆ ప్రయోగానికి సంబంధించిన సత్తా, సామర్థ్యం భారత్ కు ఉన్నాయని చెప్పారు. దానికి సంబంధించిన ప్లాన్ నూ ఇప్పటికే సిద్ధం చేసి పెట్టామని ఆయన తెలిపారు. ఎన్నో ఏండ్ల నుంచి వీనస్ మిషన్ పై పనిచేస్తున్నామని, ఇప్పుడు ప్రణాళిక తయారైందని వివరించారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సిద్ధం చేశామని, వీనస్ లో దాగి ఉన్న రహస్యాలను వెలికి తీసే ఈ ప్రాజెక్టుకు నిధులు కూడా సమకూరాయని చెప్పారు. అతి త్వరలోనే ప్రయోగాన్ని చేపడతామని సోమనాథ్ వెల్లడించారు. 

మంగళ్ యాన్ వంటి ప్రతిష్ఠాత్మక అంగారక ప్రయోగాన్ని భారత్ అతి తక్కువ ఖర్చుతోనే చేయగలగడం, ఇటు చంద్రయాన్ 2ని కూడా ఎవరూ ఊహించని రీతిలో అతి తక్కువ నిధులను వాడుకుని స్లింగ్ షాట్ టెక్నిక్ లో చేపట్టడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే భారత్ వీనస్ పైనా ఫోకస్ పెట్టింది. ఆర్బిటర్ ను పంపి అక్కడి వీనస్ ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించింది. 

చంద్రయాన్, మంగళ్ యాన్ తరహాలోనే ఈ మిషన్ లోనూ కొత్తదనాన్ని మిషన్ టీమ్ గుర్తించే పనిలో ఉందని సోమనాథ్ చెప్పారు. ప్రయోగంలో భాగంగా కొన్ని విషయాలను రిపీట్ చేసినా నేరమేం కాదని, కానీ, ప్రయోగంలో ఏదైనా కొత్తదనం ఉంటేనే ప్రపంచం దృష్టిని ఆకర్షించగలుగుతామని ఆయన తెలిపారు. 

వీనస్ పై మన దేశం ఒక్కటే కాదు.. అమెరికా వంటి అగ్రరాజ్యాలూ ప్రత్యేక దృష్టిని సారించాయి. ఉన్నట్టుండి అది నిప్పుల గోళంగా ఎలా మారిందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఉబలాట పడుతున్నాయి. శుక్ర గ్రహాన్ని అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా ఓ స్పేస్ క్రాఫ్ట్ ను పంపనుంది. అందుకోసం 100 కోట్ల డాలర్లను ప్రస్తుతానికి కేటాయించింది. 

డావిన్సి, వెరిటాస్ అని రెండు మిషన్లను చేపట్టనుంది. 2028 నుంచి 2030 మధ్య ఆ రెండు ప్రయోగాలను నిర్వహించనుంది. అంతేగాకుండా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) కూడా ఎన్విజన్ పేరిట మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వీనస్ కక్ష్యలోకి ఆర్బిటర్ ను పంపనుంది. కాగా, అతి త్వరలోనే వీనస్ ప్రయోగాన్ని చేపడతామన్న ఇస్రో.. స్పేస్ క్రాఫ్ట్ తయారీపై మరిన్ని వివరాలను వెల్లడించాల్సి ఉంది. 

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
మీరు మనసులో అనుకుంటే చాలు.. కంప్యూటర్ చేసేస్తుంది.. మస్క్ కొత్త ప్రాజెక్ట్
  • మనిషి మెదడులో చిప్ వంటి పరికరం
  • మనసు ఆలోచనలకు కంప్యూటర్ ప్రతిస్పందన
  • ఎలాన్ మస్క్ స్టార్టప్ కంపెనీ న్యూారాలింక్ ఆవిష్కరణ
  • వెన్నెముక దెబ్బతిన్న వారినీ నడిచేలా చేస్తామంటున్న మస్క్

ap7am

..ఇది కూడా చదవండి
మంచు పొరల కింద 48,500 ఏళ్ల నాటి 'జాంబీ వైరస్' ను గుర్తించిన శాస్త్రవేత్తలు
  • రష్యాలోని సైబీరియా ప్రాంతంలో పరిశోధనలు
  • ఘనీభవించిన మంచు కింద 13 వైరస్ జాతులు
  • ఇవి అత్యంత ప్రమాదకరమన్న పరిశోధకులు
  • ఇవి కలిగించే ముప్పును అంచనా వేయలేమని వెల్లడి

..ఇది కూడా చదవండి
జాబిల్లిపై ఉదయిస్తున్న పుడమి... వీడియో ఇదిగో!
  • భూమికి ఉపగ్రహం చంద్రుడు
  • భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమణం
  • భూమి ఉదయిస్తున్న దృశ్యాలను చిత్రీకరినించి జపాన్ స్పేస్ క్రాఫ్ట్
  • వీడియో వైరల్


More Latest News
Police rescues kidnapped dental doctor Vaishali
Jogi Ramesh satires on Pawan Kalyan bus Varahi
Sea comes forth in Mypadu beach
Ravi Teja first look teaser will be out now on December 12
Panchatantram movie review
Pawan flurry of tweets targeted YCP
Devineni Uma fires on CM Jagan over Polavaram
100 men kidnap a woman in Rangareddy district
Kodali Nani once again fires on TDP leaders
Tides intensifies at Uppada beach due to Cyclone Mandouse
KCR support is there for Sajjala comments says Revanth Reddy
Sathya Kumar said CM Jagan thinks about early elections
Markets ends in losses
Impact Player rule in IPL only for Indian Players
Will do Ram Nama japam till my last breath says Raja Singh
..more