పూరన్ అర్ధ సెంచరీ వృథా.. మళ్లీ ఓడిన హైదరాబాద్

02-05-2022 Mon 06:33
Gaikwad and Conway headline CSKs comfortable win against SRH

ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పోరాడి ఓడింది. 203 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 189 పరుగులు మాత్రమే చేసి 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (39)-కెప్టెన్ కేన్ విలియమ్సన్ (47) తొలి వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అభిషేక్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మార్కరమ్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. 17 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. 

నికోలస్ పూరన్ మాత్రం హైదరాబాద్ గెలుపుపై ఆశలు రేపాడు. అయితే, సహచరుల నుంచి మద్దతు కరవవడంతో ఓటమి తప్పలేదు. పూరన్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో  64 పరుగులు చేసి జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. అయితే, శశాంక్ సింగ్ (15), వాషింగ్టన్ సుందర్(2) అతడికి అండగా నిలవడంలో విఫలమయ్యారు. ఫలితంగా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేసి విజయం ముంగిట బోల్తా పడింది. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి 4 ఓవర్లు వేసి 46 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లోనే అత్యుత్తమంగా రాణించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్-కాన్వే జోడీ పెవికాల్ రాసుకొచ్చినట్టు క్రీజులో అతుక్కుపోయింది. హైదరాబాద్ బౌలర్లను వీరిద్దరూ ఊచకోత కోశారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ బౌలర్లను మార్చిమార్చి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి నిప్పులు చెరిగే బంతులు సంధించే ఉమ్రాన్ మాలిక్ కూడా ఈ జంటను విడదీయలేకపోయాడు. ఇద్దరూ కలిసి ఎడాపెడా బంతులను బౌండరీలకు తరలిస్తూ ఐపీఎల్‌లోనే అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 

57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 99 పరుగులు చేసిన గైక్వాడ్ ఒక్క పరుగు తేడాతో ఐపీఎల్‌లో రెండో సెంచరీ నమోదు చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతడి అవుట్‌తో 182 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు, కాన్వే 55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గైక్వాడ్ అవుటైన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన ధోనీ 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి చెన్నై రెండు వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది.

చెన్నైకి ఇది మూడో విజయం కాగా, హైదరాబాద్‌కు నాలుగో పరాజయం. మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పులు జరగలేదు. ఓడినప్పటికీ హైదరాబాద్ నాలుగో స్థానంలోనే ఉండగా, గెలిచిన చెన్నై కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సైన రుతురాజ్ గైక్వాడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

..Read this also
తెలంగాణ బాక్సర్ నిఖ‌త్ జ‌రీన్‌కు గ్లౌజులు ఇచ్చిన మోదీ... ఫొటో ఇదిగో
  • కామ‌న్వెల్త్ గేమ్స్‌లో స‌త్తా చాటిన నిఖ‌త్ జ‌రీన్‌
  • బాక్సింగ్‌లో ప‌సిడి ప‌త‌కాన్ని సాధించిన లేడీ బాక్స‌ర్‌
  • కామ‌న్వెల్త్ గేమ్స్ క్రీడాకారుల‌తో భేటీ అయిన ప్ర‌ధాని మోదీ
  • నిఖ‌త్ జ‌రీన్‌ను ప్ర‌త్యేకంగా స‌న్మానించిన వైనం


..Read this also
వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ షిప్‌కు పీవీ సింధు దూరం... కార‌ణం చెబుతూ భావోద్వేగానికి గురైన స్టార్ ష‌ట్ల‌ర్‌
  • కామ‌న్వెల్త్‌లో గోల్డ్ మెడ‌ల్‌తో మెరిసిన పీవీ సింధు
  • క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లోనే కాలికి గాయ‌మైన వైనం
  • కోచ్‌, ఫిజియో, ట్రైన‌ర్ల సాయంతో ముందుకు సాగిన వైనం
  • భ‌రించ‌లేని నొప్పి ఉన్నా ముందడుగే వేశాన‌న్న సింధు
  • ఎడ‌మ కాలి పాదంలో చీలిక వ‌చ్చింద‌న్న వెల్ల‌డి
  • కొన్ని వారాల పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌న్న వైద్యులు

..Read this also
నైనా జైశ్వాల్‌ను వేధించిన పోకిరి పేరు శ్రీకాంత్‌... అరెస్ట్ చేసిన పోలీసులు
సోష‌ల్ మీడియా వేదిక‌గా నైనా జైస్వాల్‌కు వేధింపులు
అస‌భ్య‌క‌ర మెసేజ్‌ల‌తో వేధించిన శ్రీకాంత్‌
జైస్వాల్ ఫిర్యాదుతో నిందితుడిని ప‌ట్టేసిన పోలీసులు


More Latest News
Karthikeya 2 movie review
Sri Lanka grants permission to China ship to dock in Humbantota port
tdp chief chandrababu visits ntr trust bhavan on satur day in hyderabad
Huge rush in Tirumala shrine
pm modi handed over glows to lady boxer nikhat zareen
Telangana corona daily report
due ti injury in cwg pv sidhu out from world championship
Tri Colour flag hoisting on CM Jagan house in Tadepalli
bjp mp subramanian swamysatires on pm modi promises
Jeevitha participates in Bandi Sanjay Padayatra
robbery in chennai fedgold bank
Iron Locker found in a old house in Vijayanagaram district
srikanth who harassed naina jaiswal arrested
Hello World web series streaming starts in ZEE5
sunday funday celebrattions on tankbund tomorrow
..more