/

మాజీ సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు వీఐపీ సెక్యూరిటీ

23-04-2022 Sat 06:16
VIP Security cover for MP Navneet Kaur Rana

గతంలో టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించిన అందాలభామ నవనీత్ కౌర్ ఆ తర్వాత మహారాష్ట్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రవి రాణాను పెళ్లాడి సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఆపై తాను కూడా రాజకీయాల్లో ప్రవేశించిన నవనీత్ కౌర్ ఎంపీగా గెలిచిన సంగతి విదితమే. 

అయితే, ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించకపోతే, ఆయన నివాసం వద్ద తాము హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణా హెచ్చరించారు. దాంతో వీరికి ముంబయి పోలీసులు నోటీసులు పంపారు. అటు, శివసేన కార్యకర్తలు సైతం వీరిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు వీఐపీ భద్రత కల్పించింది. నవనీత్ కౌర్ భద్రతకు ముప్పు ఉందని కేంద్ర నిఘా సంస్థ ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖకు నివేదిక అందజేసింది. నిఘా సంస్థ సిఫారసులకు ఆమోదం తెలిపిన కేంద్ర హోంశాఖ పారామిలిటరీ సాయుధ కమాండోలతో నవనీత్ కు 'వై' కేటగిరీ (సెంట్రల్ కవర్) భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ముగ్గురు నుంచి నలుగురు సీఐఎస్ఎఫ్ కమాండోలు నవనీత్ భద్రతా విధుల్లో పాల్గొంటారు. 

ఆమెతో పాటు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ కు కూడా వీఐపీ భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ కు 'వై ప్లస్' కేటగిరీ భద్రత ఏర్పాటు చేయనున్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
ఒక్కటే బ్లాక్.. ఒకటికి మించిన డెబిట్స్.. యూపీఐలో కొత్త ఫీచర్
  • త్వరలో అందుబాటులోకి రానున్న సదుపాయం
  • క్యాష్ ఆన్ డెలివరీ ఇబ్బందులకు పరిష్కారం
  • ఆన్ లైన్ లో ఏదైనా ఆర్డర్ చేస్తే, డెలివరీ తర్వాతే చెల్లింపులు

ap7am

..ఇది కూడా చదవండి
జంతువుల్లా కనిపిస్తారు.. కానీ మనుషులే.. ఆనంద్ మహీంద్రా మెచ్చిన వీడియో ఇదిగో!
  • పక్షులు, సింహం, పులిగా మారిపోయిన మనుషులు
  • శరీరంపై పెయింట్ వేసుకుని వాటిని మరిపించే విధంగా భంగిమలు
  • ట్విట్టర్ లో షేర్ చేసిన మహీంద్రా గ్రూప్ చైర్మన్

..ఇది కూడా చదవండి
ఈ ఏడాది వినూత్న డిజైన్లతో మనసు గెలిచిన ఫోన్లు
  • అన్నింటిలోకీ నథింగ్ ఫోన్ 1 ప్రత్యేకం
  • ఫోన్ వెనుక భాగం పారదర్శకం
  • రియల్ మీ జీటీ 2 ప్రో, వివో వీ 25 ప్రో కూడా ప్రత్యేకమే
  • సూపర్ లగ్జరీ ఫినిష్ తో గెలాక్సీ ఎస్22 అల్ట్రా


More Latest News
Nara Lokesh visits Penumuli village
C Kalyan opines on theaters issue
Gurthunda Seetakalam Review
Chandrababu take a swipe at CM Jagan
Mandous barrels towards North Tamilnadu and South Coastal Andhra
Police rescues kidnapped dental doctor Vaishali
Jogi Ramesh satires on Pawan Kalyan bus Varahi
Sea comes forth in Mypadu beach
Ravi Teja first look teaser will be out now on December 12
Panchatantram movie review
Pawan flurry of tweets targeted YCP
Devineni Uma fires on CM Jagan over Polavaram
100 men kidnap a woman in Rangareddy district
Kodali Nani once again fires on TDP leaders
Tides intensifies at Uppada beach due to Cyclone Mandouse
..more