‘మహీంద్రా’లో మహీ ఉంది.. ధోనీకి ఆనంద్ మహీంద్రా ప్రత్యేక అభినందనలు
22-04-2022 Fri 14:00
- మహీంద్రాలో మహీ అక్షరాలను గుర్తు చేసిన ఆనంద్ మహీంద్రా
- సంతోషంగా ఉందంటూ మహీంద్రా కామెంట్
- అద్భుతమైన ముగింపు అంటూ ట్వీట్
- చక్కటి ట్వీట్ తో స్పందించిన సీఎస్కే

ముంబైతో మ్యాచ్ లో చివరి వరకు నిలిచి చెన్నై జట్టు విజయానికి కారకుడైన మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసల జల్లు పెద్ద ఎత్తున కురుస్తోంది. ప్రముఖ క్రికెటర్లతోపాటు, మంత్రి కేటీఆర్ సహా ఎందరో ధోనీ ఇన్నింగ్స్ పై అభిప్రాయాలు తెలియజేయగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం స్పందించారు. ‘‘MAHI-NDRA లో MAHI అన్న అక్షరాలను కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నామని తెలియజేస్తున్నా. అద్భుతమైన ముగింపు’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ముంబైపై చెన్నై విజయానికి సాధించాల్సిన పరుగులతో పోలిస్తే ఉన్న బంతులు తక్కువ. అయినా ధోనీ ప్రశాంతంగా క్రీజులో ఉండి చివరి ఓవర్ లో చెలరేగి పోవడం తెలిసిందే. ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు భారీగా లైక్ లు పడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సైతం మహీంద్రాకు ధన్యవాదాలు చెబుతూ అద్భుతంగా స్పందించింది. మనలో ఆనంద్ ఉన్నాడంటూ ట్వీట్ పెట్టింది.
More Latest News
అమరావతి ఉద్యోగులకు 5 రోజుల పని ఏడాది పాటు పొడిగింపు
43 seconds ago

ఉక్రెయిన్ లోని స్నేక్ ఐలాండ్ నుంచి వైదొలగిన రష్యన్ సేనలు
21 minutes ago

50 రోజులను పూర్తిచేసుకున్న 'సర్కారువారి పాట'
38 minutes ago

ఒకేసారి ఇద్దరు కుమారులు మరణిస్తే డిప్రెషన్లోకి వెళ్లి.. మహారాష్ట్ర సీఎంగా ఎదిగిన షిండే!
1 hour ago
