మహిళా కాంగ్రెస్లో కీలక పరిణామం... హైదరాబాద్ సిటీ చీఫ్ పదవి నుంచి కవిత తొలగింపు
19-04-2022 Tue 16:44
- ఇటీవల సునీతారావు, కవితల మధ్య గాంధీ భవన్లో ఘర్షణ
- ఘటనపై విచారణ చేపట్టిన మహిళా కాంగ్రెస్
- క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే కవితపై వేటు

తెలంగాణ కాంగ్రెస్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళా కాంగ్రెస్ హైదరాబాద్ నగర అధ్యక్షురాలిగా కొనసాగుతున్న కవితను ఆ పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు మహిళా కాంగ్రెస్ మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది.
కవితను పదవి నుంచి తొలగించడానికి ఓ ప్రధాన కారణమే ఉంది. ఇటీవల గాంధీభవన్ వేదికగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావుతో కవిత వాగ్వాదానికి దిగారు. ఈ ఘర్షణ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురి చేసింది.
దీనిపై విచారణ చేపట్టిన మహిళా కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కవితను సిటీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం కవితను పార్టీ పదవి నుంచి తొలగిస్తూ ప్రకటన కూడా జారీ చేసింది.
More Latest News
ఇది వినడానికే సిగ్గుగా ఉంది: విజయశాంతి
9 hours ago

తెలంగాణలో తాజాగా 477 కరోనా పాజిటివ్ కేసులు
9 hours ago

గతంలో నన్ను 'చవట' అన్నారు, 'దద్దమ్మ' అన్నారు... నేను పట్టించుకోలేదు: గెహ్లాట్ తో వివాదంపై సచిన్ పైలట్
10 hours ago
