ట్విట్టర్ నా చేతుల్లోకి రానివ్వండి.. వాళ్లకు ఒక్క పైసా దక్కనివ్వను: ఎలాన్ మస్క్ స్ట్రాంగ్ వార్నింగ్

19-04-2022 Tue 13:50
Elon Musk Warning To Twitter Board

ట్విట్టర్ ను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేయని ప్రయత్నమంటూ లేదు. ఇప్పటికే బోర్డు డైరెక్టర్లు.. మస్క్ కు కంపెనీని అప్పగించేందుకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలోనే మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. 

‘‘నేను అనుకున్నదిగానీ జరిగితే బోర్డు వేతనం సున్నా డాలర్లు అయిపోతుంది. దాని వల్ల ఏడాదికి 30 లక్షల డాలర్లు ఆదా అవుతాయి’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల మస్క్ ట్విట్టర్ లో 9.1 శాతం వాటాను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. తద్వారా సంస్థలో రెండో అతిపెద్ద వాటాదారుగా ఆయన నిలిచారు. 

ఈ క్రమంలోనే ట్విట్టర్ ను కొంటానని బోర్డు డైరెక్టర్లకు ఆయన ఆఫర్ ఇచ్చారు. 4,300 కోట్ల డాలర్ల ఆఫర్ ను ప్రకటించారు. అయితే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే తన ఫాలోవర్లు, షేర్ హోల్డర్లను ఉద్దేశిస్తూ.. ట్విట్టర్ షేర్ ముఖ విలువను 54.2 డాలర్లకు చేర్చేది షేర్ హోల్డర్లేనని, బోర్డు కాదని అన్నారు. 

అయితే, మస్క్ కు చెక్ పెట్టేందుకు సంస్థ వాటాదారుల్లో ఎవరైనా 15 శాతం వాటా తీసుకోకుండా ఉండడాన్ని నివారించేందుకు బోర్డు.. షేర్లను రిబేటు మీద అమ్మేందుకు నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని తప్పుబడుతూ నెటిజన్లు ట్వీట్ చేస్తుండడంతో.. మస్క్ రిప్లై ఇచ్చారు. కంపెనీ తన చేతుల్లోకి వస్తే బోర్డు డైరెక్టర్లెవరికీ పైసా దక్కదని స్పష్టం చేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
సెప్టెంబరు మాసంలో రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాల మోత
 • 145 శాతం అమ్మకాల వృద్ధి
 • సెప్టెంబరులో 82 వేల యూనిట్ల విక్రయం
 • గతేడాది సెప్టెంబరులో 33 వేల బైకుల విక్రయం
 • ఎగుమతుల పరంగానూ 34 శాతం వృద్ధి నమోదు

ap7am

..ఇది కూడా చదవండి
భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
 • 638 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
 • 207 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
 • 3 శాతానికి పైగా నష్టపోయిన మారుతి సుజుకి షేరు విలువ

..ఇది కూడా చదవండి
సెప్టెంబరు మాసంలో మారుతి సుజుకి అమ్మకాల రికార్డు
 • గతేడాది సెప్టెంబరుతో పోల్చితే భారీ వృద్ధి
 • 135.10 శాతం అమ్మకాల పెరుగుదల
 • ఈ ఏడాది సెప్టెంబరులో 1.48 లక్షల యూనిట్ల అమ్మకం
 • గతేడాది సెప్టెంబరులో 63 వేల యూనిట్ల విక్రయం


More Latest News
Team India rested Kohli and KL Rahul
More flood water towards Vijayawada Prakasam Barrage
Royal Enfield September sales up by 145 percent
Bandla Ganesh Interview
TRS will win in Munugode says Jagadish Reddy
Karnataka man smashes 42 coconuts on heads in a minute with Nunchaku
Prachand Helicopters inducted into Indian Air Force
KCR national party will bring changes in all states says Errabelli
IT companies rejecting offer letters to freshers
Teacher drinking beer while teaching students in UP
markets ends in losses
Nobel Prize in medicine goes to Sweden born Svante Paabo
Praveen Sattharu Interview
CM KCR talks to Akilesh Yadav over Mulayam Singh Yadav health
Roja visits Vizag Swaroopanandrendra peetam
..more