'జయమ్మ పంచాయితీ' ట్రైలర్ ఆవిష్కరించిన పవన్ కల్యాణ్
16-04-2022 Sat 14:14
- సుమ ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయితీ
- విజయ్ కుమార్ దర్శకత్వంలో చిత్రం
- కీరవాణి సంగీతం.. మే 6న రిలీజ్

ప్రముఖ యాంకర్ సుమ కనకాల సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభిస్తూ చేసిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'. కెరీర్ తొలినాళ్లలో హీరోయిన్ గా నటించిన సుమ ఆ తర్వాత యాంకరిగ్ వైపు వెళ్లి, ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది. అయితే, ఇటీవల ఆమె జయమ్మ పంచాయితీ చిత్రం ద్వారా మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విడుదల చేశారు.
విజయ్ కుమార్ దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం మెల్లగా హైప్ పెంచుకుంటోంది. పవన్ కల్యాణ్ ట్రైలర్ రిలీజ్ చేయడంతో అందరి దృష్టి జయమ్మ పంచాయితీపై పడింది. బలగా ప్రకాశ్ నిర్మాతగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
More Latest News
రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు... వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు
5 hours ago

తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్
6 hours ago

తెలంగాణలో ఒక పార్లమెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామకం... జాబితా ఇదిగో
6 hours ago
