పదవులు శాశ్వతం కాదు... మాజీ ఎంపీ పొంగులేటి కీలక వ్యాఖ్యలు
13-04-2022 Wed 17:14
- అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న పొంగులేటి
- ప్రజల్లో తిరిగే వాడే నాయకుండంటూ కామెంట్
- పదవులు ముఖ్యం కాదంటూ మరింత ఘాటు వ్యాఖ్య
- అంబేద్కర్ అన్ని వర్గాలకు ఆదర్శమన్న మాజీ ఎంపీ

టీఆర్ఎస్ కీలక నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నోట నుంచి వచ్చిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మంలో బుధవారం జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాలుపంచుకున్న పొంగులేటి, రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్లో ఓ వర్గం గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
"పదవులు ముఖ్యం కాదు. ప్రజల ప్రేమాభిమానాలు ఉండాలి. అవి లేకపోతే రాజకీయ నాయకులు కాలగర్భంలోకి వెళ్లినట్టే. మనం లేకపోయినా ప్రజలు మనల్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రజల్లో తిరిగేవాడే నాయకుడు. నాయకుడు జనంలో ఉండాలి. జనం ఆ నేతను గుర్తు పెట్టుకోవాలి. అంబేద్కర్ అన్ని వర్గాలకు ఆదర్శం" అంటూ పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు.
More Latest News
దమ్ముంటే గన్‌మెన్ లేకుండా బయటకు రా!... పరిటాల శ్రీరామ్‌కు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సవాల్!
2 minutes ago

రజనీతో సినిమా అంటే మాటలా?: 'విక్రమ్' డైరెక్టర్
38 minutes ago

40 కోట్లను కొల్లగొట్టిన 'సీతా రామం'
1 hour ago

'లైగర్' నుంచి కోకా సాంగ్ రిలీజ్!
1 hour ago
