తల్లి కాబోతున్నట్లు తెలిపిన సినీ నటి ప్రణీత
11-04-2022 Mon 13:29 | International
- ఇన్స్టాగ్రామ్లో ప్రణీత పోస్ట్
- తన భర్త 34వ పుట్టినరోజు నేడు అని వివరణ
- దేవుడు తమకు గొప్ప బహుమతి ఇచ్చాడన్న ప్రణీత

తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు తెలుపుతూ సినీ నటి ప్రణీత ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేసింది. తన భర్త నితిన్ రాజు (బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త) 34వ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలుపుతున్నట్లు పేర్కొంది. దేవుడు తమకు గొప్ప బహుమతి ఇచ్చాడని తెలిపింది.
ప్రణీతకు పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ ప్రణీత పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన 'అత్తారింటికి దారేది', జూనియర్ ఎన్టీఆర్ 'రభస', మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం' సినిమాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. కొవిడ్ సమయంలో ఆమె పేదలకు సాయం చేసింది.
More Latest News
ఈసారి మేనేజర్ల వంతు.. వేటుకు సిద్ధమైన జుకర్బర్గ్!
20 minutes ago

బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
8 hours ago

వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
9 hours ago

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల
11 hours ago

కడప జిల్లా గండికోటలో కమలహాసన్ సందడి
12 hours ago
