ప్రభుత్వాలు నంది అవార్డులు ఇవ్వడంలేదు: మురళీమోహన్
02-04-2022 Sat 22:00
- ఏడేళ్లుగా అవార్డులు ఇవ్వడంలేదన్న మురళీమోహన్
- కార్యక్రమాన్ని పక్కనబెట్టారని ఆవేదన
- అవార్డులు ప్రాణవాయువు వంటివని వ్యాఖ్య

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నంది అవార్డులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆరోపణలు వస్తుండడం తెలిసిందే. సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఏడేళ్ల నుంచి నంది అవార్డులు ఇవ్వడంలేదని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వాలు నంది అవార్డుల కార్యక్రమాన్ని పక్కనబెట్టాయని అన్నారు.
కొన్ని ప్రైవేటు సంస్థలు మాత్రం సినీ కళాకారులకు అవార్డులు ఇస్తున్నాయని మురళీమోహన్ పేర్కొన్నారు. సినీ కళాకారులకు నంది అవార్డులు ప్రాణవాయువు వంటివని ఆయన అభివర్ణించారు. హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
More Latest News
రూ.1000 కోట్ల తాయిలాలు పొందిన తర్వాతే డాక్టర్లు డోలో-650 రాస్తున్నారంటూ పిటిషన్... విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
26 minutes ago

వాళ్లు బ్రాహ్మణులు... సంస్కారవంతులు: బిల్కిస్ బానో రేపిస్టులపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
52 minutes ago

బాయ్ కాట్ ట్రెండ్ పై అర్జున్ కపూర్ వ్యాఖ్యలు... నీ పని నువ్వు చూస్కో అంటూ మధ్యప్రదేశ్ మంత్రి కౌంటర్
2 hours ago

టాలీవుడ్ వాళ్లు షూటింగులు ఆపేసి ఏం చేస్తున్నారని బాలీవుడ్ వాళ్లు ఆరా తీస్తున్నారు: దిల్ రాజు
4 hours ago
