ఆన్ లైన్ లో అమ్మకానికి 'ఆత్మ'... కొంటారా...?

02-04-2022 Sat 16:07
Dutch student put his soul for sale

ఈ టెక్ యుగంలోనూ ఆత్మలు ఉంటాయని నమ్మేవాళ్లు చాలామంది ఉంటారు. తాజాగా, నెదర్లాండ్స్ కు చెందిన స్టిన్ వాన్ షైక్ అనే 21 ఏళ్ల విద్యార్థి హేగ్ ఆర్ట్ అకాడమీలో కోర్సు చేస్తున్నాడు. తాజాగా తన ఆత్మను అమ్మకానికి పెట్టి సంచలనం సృష్టించాడు. అది కూడా తన ఆత్మను బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సహితమైన నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్ టీ) రూపంలో ఓపెన్ సీ ఆన్ లైన్ మార్కెట్లో అమ్మకానికి పెట్టాడు. తన ఆత్మను డిజిటల్ కళారూపంగా పేర్కొంటూ, ఎవరైనా కొనుగోలు చేయవచ్చని ఆఫర్ చేశాడు. 

"హలో... నా ప్రొఫైల్ కు స్వాగతం. నా ఆత్మను ఇక్కడ అమ్మకానికి ఉంచాను. నా గురించి, నా ఆత్మ గురించి అడగడానికి ఎలాంటి సంకోచాలు వద్దు" అని వాన్ షైక్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. అంతేకాదు, తన ఆత్మను విక్రయించడం కోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను ఏర్పాటు చేశాడు. కాగా, ఆత్మను కొనుగోలు చేసినవారికి... ఆత్మను మొత్తంగానూ, లేక కొన్ని భాగాలుగానూ అందిస్తానని వాన్ షైక్ వెల్లడించాడు. ఎవరికైనా ఆత్మబలిదానం వంటి వాటిపై నమ్మకం ఉంటే తన ఆత్మను బలి ఇవ్వొచ్చని సూచిస్తున్నాడు. 

తన ఆత్మను ఎన్ఎఫ్ టీ రూపంలో అమ్మకానికి పెడుతున్నానని, బ్లాక్ చెయిన్ సాంకేతికత సాయంతో క్రిప్టో కరెన్సీ చెల్లింపుల ద్వారా కొనుగోలు చేయొచ్చని తెలిపాడు. కాగా, ఓపెన్ సీ ఎన్ఎఫ్ టీ మార్కెట్లో ప్రస్తుతం ఈ నెదర్లాండ్స్ విద్యార్థి ఆత్మకు 347 డాలర్ల వరకు బిడ్డింగ్ చేరుకుంది. అది ఇంకా పెరుగుతుందని ఆ విద్యార్థి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
.

..Read this also
ఉక్రెయిన్ లోని స్నేక్ ఐలాండ్ నుంచి వైదొలగిన రష్యన్ సేనలు
  • ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడులు
  • మొదట్లోనే స్నేక్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకున్న రష్యా
  • తాజాగా కీలక నిర్ణయం
  • ఐక్యరాజ్యసమితి కోసమేనని వెల్లడి


..Read this also
'శాండ్​ విచ్'​పై గొడవ.. రెస్టారెంట్ సిబ్బందిపై కాల్పులు జరిపిన కస్టమర్​.. ఒకరి మృతి!​
  • సబ్ వే రెస్టారెంట్ లో వెన్న తరహాలో ఉండే మేయో విషయంపై వివాదం
  • ఆగ్రహంతో ఉన్మాదిలా మారిన కస్టమర్
  • ఇద్దరు మహిళా సిబ్బందికి గాయాలు.. వారిలో ఒకరు మృతి
  • కుమారుడి కళ్ల ముందే తల్లి మృతి చెందడంతో తీవ్ర విషాదం

..Read this also
110 దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. మహమ్మారి మార్పు చెందుతోంది: డబ్ల్యూహెచ్​ వో హెచ్చరిక
  • కరోనా వ్యాప్తి ఇంకా ముగిసిపోలేదు
  • పరీక్షలు, కొత్త కేసుల నమోదు తగ్గిపోవడంతో సమస్య
  • కొత్త వేరియంట్ల గురించి విశ్లేషించడం కష్టంగా మారిందని వెల్లడి


More Latest News
bjp orders devendra fadnavis top take charge as maharashtra deputy cm
Eknath Shinde make a video call to rebels after finalized CM post
ap government extends 5 days work for one more year to amaravati employees
The Warrior Movie Update
4 bjp ghmc corporators and tandur minicipality bjp floor leader swift to trs
Russian troops leaves Snake Island
ap government hikes diesel cess in apsrtc buses
Sarkaru Vaari Paata movie update
Pranitha displays placard on Jaipur incident
Activists have no value in TRS Confidence in Congress is gone Joining BJP says Konda Vishweshwar Reddy
Sajjala opines on laptops issue
amaravati mp navneet kaur rana meets draupadi murmu in delhi
Dasara movie upadate
Telangana tentd class exams results released
Mantri Sridevi appointed as Telangana official language committee chairperson
..more